అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో బ్రిడ్జిపై సెలూన్ వెలిసింది. లాస్ ఏంజిల్స్‌లో అత్యంత రద్దీగా ఉండే బ్రిడ్జి మధ్య ఓ బార్బర్ హెయిర్‌కట్ చేస్తూ కనిపించాడు. అతడి పక్కనుంచి కార్లు వెళ్తూ కనిపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ‘బాయిల్ హైట్స్’ అనే యూజర్ ట్విటర్లో షేర్చేశారు. లాస్ ఏంజిల్స్‌లో ఓ స్టీల్ బ్రిడ్జిని రెండు వారాల కింద ప్రారంభించారు. ఈ బ్రిడ్జిపై రెండు లేన్ల మధ్యలో ఓ కుర్చీలో కస్టమర్ కూర్చొని ఉన్నాడు. బార్బర్ ప్రశాంతంగా హెయిర్‌కట్ చేస్తున్నాడు. వాహనాలు వారి దగ్గరకు రాగానే స్లో అవుతూ వెళ్లడం కనిపించింది. అయితే, ఆ బార్బర్ ఇలా ఎందుకు చేశాడో వివరాలు తెలియరాలేదు.
Man gets haircut in the middle of the 6th Street Bridge in Boyle Heights pic.twitter.com/20d8jzZAeC
— Boyle Heights (@boyle_hts) July 21, 2022