e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News ఇలా చేస్తే డెబిట్ కార్డు బ్లాక్ అవుతుంది…తెలుసా…?

ఇలా చేస్తే డెబిట్ కార్డు బ్లాక్ అవుతుంది…తెలుసా…?

ఇలా చేస్తే డెబిట్ కార్డు బ్లాక్ అవుతుంది…తెలుసా…?

హైదరాబాద్ , మే 25 : మీరు మీ డెబిట్ కార్డులతో ఆన్‌లైన్ లేదా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయకపోతే బ్యాంకులు వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూచనల మేరకు బ్యాంకులు ఈ చర్యలు చేపడుతున్నాయి. ఈ విషయంలో బ్యాంకులు ఇప్పటికే తమ వినియోగదారులకు ఇ-మెయిల్స్ పంపడం ప్రారంభించాయి కూడా. ఇప్పటికే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన వినియోగదారులకు ఈ విధంగా మెయిల్ చేసింది. మీరు గత రెండు సంవత్సరాలుగా ఆన్‌లైన్ చెల్లింపుల కోసం డెబిట్ కార్డును ఉపయోగించలేదని తెలుస్తుంది. కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు, ఆర్బిఐ మార్గదర్శకాల దృష్ట్యా 10 రోజుల తరువాత డెబిట్ కార్డు బ్లాక్ చేయనున్నట్లు తెలిపింది.

రెగ్యులేటరీ మార్గదర్శకాలను పరిశీలిస్తే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వాడకం ఎప్పటికప్పుడు కనిపిస్తుంది. మోసపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించడమే ఈ చర్య తీసుకోవడం వెనుక ఉన్న ముఖ్య కారణం. ఏ బ్యాంక్ కార్డులైనా సరే క్రమం తప్పకుండా ఉపయోగించకపోతే అవి బ్లాక్ అవుతాయట. ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ కావడం వల్ల రిజర్వ్ బ్యాంక్ మిగతా బ్యాంకులకు కొన్ని ప్రత్యేక సూచనలు చేసింది. కార్డు జారీ చేసే బ్యాంకులు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. జనవరి 2020 లో ఆర్‌బిఐ తన సర్క్యులర్‌ను విడుదల చేసింది.

చాలా కాలంగా ఆన్‌లైన్, అంతర్జాతీయ, లేదా కాంటాక్ట్‌లెస్ లావాదేవీలకు ఉపయోగించని కార్డులు నిలిపివేయబడాలని అర్థం. మీరు మీ డెబిట్ కార్డుతో ఆన్‌లైన్ చెల్లింపులు చేయకపోతే కార్డు బ్లాక్ అవుతుంది. అయితే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మళ్లీ ఆన్‌లైన్ సదుపాయాన్ని ప్రారంభించడానికి, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వండి, కార్డును సులభంగా సక్రియం చేయగలుగుతారు. ఐ మొబైల్ యాప్‌లో కార్డు బ్లాక్ లేదా అన్‌బ్లాక్ గురించి తెలియజేయాలని ఐసిఐసిఐ బ్యాంక్ తన వినియోగదారులకు తెలిపింది. కార్డ్ బ్లాక్ చేస్తే వినియోగదారులు యాప్ ద్వారా సులభంగా తిరిగి ప్రారంభించవచ్చు. దాదాపు అన్ని బ్యాంక్ మొబైల్అప్స్ కార్డును బ్లాక్ చేసి, అన్‌బ్లాక్ చేసే సదుపాయాన్ని కలిగి ఉన్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇలా చేస్తే డెబిట్ కార్డు బ్లాక్ అవుతుంది…తెలుసా…?

ట్రెండింగ్‌

Advertisement