e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News బంగ్లాదేశ్‌ సెంట్రల్ లైబ్రరీకి నిప్పంటించిన ఉగ్రవాదులు

బంగ్లాదేశ్‌ సెంట్రల్ లైబ్రరీకి నిప్పంటించిన ఉగ్రవాదులు

బంగ్లాదేశ్‌ సెంట్రల్ లైబ్రరీకి నిప్పంటించిన ఉగ్రవాదులు

ఢాకా: బంగ్లాదేశ్‌లో హెఫాజాత్‌ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బ్రహ్మన్‌బరియా జిల్లాలోని కేంద్ర ప్రజా గ్రంథాలయానికి హెఫాజాత్‌ ఉగ్రవాదులు ఆదివారం నిప్పు పెట్టారు. ఢాకా, నార్షింగ్డ్‌, నారాయణగంజ్, బ్రహ్మన్‌బరియా, చిట్టగాంగ్, సిల్హెట్, రాజ్‌షాహి, ఇతర జిల్లాల్లో హెఫాజాత్ ఏ ఇస్లాం ఆధ్వర్యంలో సమ్మె జరుగుతున్నది.

రహదారులపై దూర ప్రాంతాల బస్సులు నడువడంలేదు. రిక్షాలు, ఆటో-రిక్షాల కదలిక సాధారణంగా ఉన్నది. నారాయణగంజ్ మదానినగర్ మదర్సా విద్యార్థులు ఢాకా-చిట్టగాంగ్ రహదారిపై టైర్లను తగలబెట్టడం ద్వారా చిట్టగాంగ్-సిల్హెట్‌లతో రాజధాని నగరం రహదారులు మూసుకుపోయాయి.

సిల్హెట్‌లో హెఫాజత్-ఏ-ఇస్లాం పతాకాలను చేతబూనిన జమాత్-ఏ-ఇస్లాం కార్యకర్తలు ఉదయం ప్రార్థనల తరువాత కోర్ట్ పాయింట్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో ఊరేగింపులను నిర్వహించారు.

నగరంలోని అమ్చత్తర్ ప్రాంతంలోని రాజ్‌షాహి ట్రక్ టెర్మినల్‌లో ఉగ్రవాదులు ప్రభుత్వ యాజమాన్యంలోని బంగ్లాదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కార్పొరేషన్ (బీఆర్‌టీసీ) కి చెందిన రెండు బస్సులకు సాయంత్రం వేళ నిప్పంటించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని షా మఖ్దుమ్ పోలీస్ స్టేషన్ అధికారి సైఫుల్ ఇస్లాం ఖాన్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.

శుక్రవారం రాత్రి రాజధాని నగరం ఢాకాలోని పురాణ పాల్తాన్‌లో మీడియా సమావేశంలో హెఫాజాత్-ఏ-ఇస్లాం నాయకులు దేశవ్యాప్త సమ్మెను ప్రకటించారు. చిట్టగాంగ్‌లోని హతాజారి వద్ద శుక్రవారం హెఫాజాత్ మద్దతుదారులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు మృతి చెందగా, కనీసం 50 మంది గాయపడ్డారు.

ఢాకాలో, శుక్రవారం మధ్యాహ్నం బైతుల్ ముకర్రం జాతీయ మసీదు ప్రాంతంలో రాడికల్ ఫోర్స్ మద్దతుదారులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో అనేక మంది జర్నలిస్టులతో పాటు కనీసం 50 మంది గాయపడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ప్రజలు ఊరేగింపు చేపట్టకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణలు చెలరేగాయి.

ఇవి కూడా చదవండి..

‘మన్‌ కి బాత్‌’ లో మన మిథాలికి మోదీ ప్రశంస

అంతా పబ్లిక్ చేయకూడదు: శరద్ పవార్‌తో భేటీపై అమిత్‌షా

లైంగికదాడి, హత్య కేసులో దోషికి మరణశిక్ష

విమానం ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నం.. పోలీసులకు అప్పగింత

ఇండోనేషియాలో బాంబు పేలుడు.. 14 మందికి గాయాలు

సప్త వర్ణాల శోభితం.. వివిధ రాష్ట్రాల్లో హోలీ కేళీ

అద్భుతమైన విజయాలకు మరో పేరు.. సైనా నెహ్వాల్

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బంగ్లాదేశ్‌ సెంట్రల్ లైబ్రరీకి నిప్పంటించిన ఉగ్రవాదులు

ట్రెండింగ్‌

Advertisement