ఈ అక్క యాదికున్నదా? బతుకమ్మ పండుక్కి ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం చీరలిస్తె. ఈ చీరెలు బాగలేవని వద్దన్న లింగమ్మ మాటలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్నికల వేడితో ఉన్న మునుగోడులోని బంగారిగడ్డ లింగమ్మ ఉండే ఊరు. ఇప్పుడెవరికి ఓటేస్తవంటే.. కేసీఆర్ సారుకే నా ఓటంటున్నది. ఇంకెన్ని ముచ్చట్లు చెప్తుందో సదవండి!
బతుకమ్మ పండక్కి చీరలిచ్చిండు. అప్పు డు మంచియి ఇయ్యలే. ఇంతమందికి ఆయన మాత్రం ఎక్కడ తెచ్చిస్తడు అనిపిస్తుంది. మెత్త టి చీరయితే బాగుంటదని అన్న. ఇప్పుడు కేసీఆర్ దిక్కే మాట్లాడతాం. తప్పేముంది?
ఆయన పదవిలో ఉండంగనే చెరువులు బాగుచేస్తుండు. ఆయనకు ఓటేస్తే చెరువు పనులయితయి. రాజగోపాల్‌రెడ్డి ఏం జేయలే. టీఆర్ఎస్కి ఓటెయ్యాల్సిందే. ఊరోళ్లంతా ఇదే అంటున్నరు. శివన్నగూడెం ప్రాజెక్ట్ చూస్తు న్నం. కేసీఆర్ గెలవాలె. అది పూర్తి కావాలె. ప్రాజెక్ట్ కడితే నీళ్లువారుతయ్. నేనిప్పుడు కేసీఆర్‌కే ఓటేస్తా. ముసలోళ్లకు పైసలిస్తుండె. రైతు బంధు ఇస్తుండె. ఆయన ఏం తక్కువ జేసిం డు?.. తిరస్కారం జెయ్య. కారుకే ఓటెయ్యా లె. ఆయన్ని గెలిస్తేనే పనులు అయితయి మల్లా. చెరువులు సగం (శివన్నగూడెం ప్రాజె క్ట్) జేసిండు. వాటికి పైసలు ఇస్తే మిగతా పనులయితయ్. ఆడపిల్లకు పెండ్లయితే లక్ష రూపాయలు ఇస్తుండె. పుట్టంగనే పిల్లలకు డబ్బులు, సబ్బులు, నూనె అన్ని ఇస్తుండె. అందుకే కారు గెలవాలె. సారు రావాలె.
లింగమ్మ, గ్రామం బంగారిగడ్డ , మనుగోడు నియోజకవర్గం నమస్తే తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్