సియోల్: దక్షిణ కొరియా ఇవాళ నిర్వహించిన బాలిస్టిక్ క్షిపణి(Ballistic Missile Crash) పరీక్ష విఫలమైంది. ఉత్తర కొరియా నిర్వహిస్తున్న క్షిపణి పరీక్షలకు వ్యతిరేకంగా.. ఇవాళ అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. దానిలో భాగంగా చేపట్టిన క్షిపణి పరీక్ష విఫలమైనట్లు తెలుస్తోంది. హ్యున్మో-2 షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అదుపు తప్పి ఓ నగరంలో పేలినట్లు తాజా సమాచారం ద్వారా వెల్లడైంది. ఇప్పటికే ఉత్తర, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. హ్యున్మో-2 క్షిపణి .. గాంగ్నుయాంగ్ నగరంలోని ఎయిర్ఫోర్స్ బేస్ వద్ద పేలినట్లు చెబుతున్నారు. మిస్సైల్ నేతలను తాకిన సమయంలో భారీగా మంటలు వ్యాపించాయి. మిస్సైల్ నేలకూలిన అంశంపై దక్షిణ కొరియా ప్రకటన చేసినా.. ఆ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని చెప్పింది.