రెండు రోజుల్లో నందమూరి అభిమానుల (Nandamuri Fans)కు అదిరిపోయే గుడ్ న్యూస్ ఉండబోతుందన్న వార్త ఇపుడు ఫిలింనగర్లో హల్చల్ చేస్తోంది. ఇంతకీ రెండు రోజుల్లో ఏంటనుకుంటున్నారా..? జూన్ 10న బాలకృష్ణ (Nandamuri Balakrishna birthday) బర్త్ డే అని తెలిసిందే. ఈ సందర్భంగా తన అభిమానులకు ఎక్జయిటింగ్ అప్ డేట్స్ ఇచ్చేందుకు నందమూరి హీరో రెడీ అయ్యాడట. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఎన్బీకే 107 (Nbk 107), అనిల్ రావిపూడితో ఎన్బీకే 108 (Nbk 108) ప్రాజెక్టులను లైన్ పెట్టాడు బాలకృష్ణ.
గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను ప్రకటిచండంతోపాటు చిన్న టీజర్‌ను కూడా లాంఛ్ చేయనున్నాడని ఇన్ సైడ్ టాక్. దీంతోపాటు అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా టైటిల్‌ను కూడా అదే రోజు ప్రకటించనున్నాడట. ఈ రెండు సినిమాలకు పవర్ ఫుల్ టైటిల్స్ ఉండబోతున్నాయని టాక్ నడుస్తోంది.
అఖండ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాల అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతుండటం అభిమానులకు మాత్రం డబుల్ బొనాంజా అనే చెప్పాలి.