కోవిడ్ సెకండ్ వేవ్‌తో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో అయితే కేసుల పరిస్థితి నానాటికి పెరిగిపోతుంది. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోవిడ్ టైంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న వారికి తనవంతు అండగా నిలిచారు. హిందూపూర్ నియోజకవర్గంలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్ రోగుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కోవిడ్ రోగుల వివరాలను, వారికి అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అంతేకాదు చాలా మందికి కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయించడమే కాకుండా వారికి కావాల్సిన వైద్య, ఇతర సదుపాయాలను కల్పించి గొప్ప మనసు చాటుకున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ.
ఇవి కూడా చదవండి..
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్
థియేటర్ కు వెళ్లకుండా రాధే చూడాలంటే..?
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
Recommended Content by ntnews.comSkip Ad