నందమూరి బాలకృష్ణ టైం ఇప్పుడు మాములుగా లేదు. వెండితెర, డిజిటల్ మీడియాలలోను రచ్చ లేపుతున్నారు. రీసెంట్గా అఖండ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన బాలయ్య ఆహా వేదికగా ప్రసారం అవుతున్న అన్స్టాపబుల్తోను రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్నాడు. ఈ షోలో ముందుగా మోహన్ బాబు గెస్ట్‌గా హాజరు కాగా, తర్వాత నాని వచ్చి సందడి చేశాడు.
ఇక షోలో 3వ ఎపిసోడ్ కోసం కామెడీ కింగ్ బ్రహ్మానందం, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చారు. ఇప్పటికే షోకి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, శుక్రవారం స్ట్రీమింగ్ కానుంది. తాజాగా షోకి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా, ఇందులో బ్రహ్మీ కోరిక మేరకు బాలకృష్ణ దివంగత లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుని అద్భుతంగా అనుకురించారు.
డైలాగ్‌ని చాలా స్పష్టంగా చెబుతూ అచ్చం ఏఎన్ఆర్ మాదిరిగా హావభావాలు ప్రదర్శించడంతో బ్రహ్మానందం షాక్ అయిపోయారు. ప్రేక్షకులు కూడా ఫుల్ ఇంప్రెస్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక మహేష్ బాబుతోను బాలకృష్ణ ఫుల్ సందడి చేయనున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ నిన్న జరిగినట్టు తెలుస్తుంది. వచ్చే వారం ఆ ఎపిసోడ్ ప్రసారం కానుంది.