ముంబై ,జూలై : బజాజ్ ఆటో ఇప్పుడు తిరిగి కాలిబర్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. బజాజ్ ఆటో నుంచి రాబోయే మరో కొత్త బైక్ కోసం ఈ పేరును ఉపయోగించనున్నట్లు సమాచారం.ఈ మేరకు బజాజ్ ఆటో ‘కాలిబర్’ పేరును ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు కూడా చేసుకున్నది. బజాజ్ నుంచి రాబోయే ఈ కొత్త బైక్ ఎంట్రీ మోటార్‌సైకిల్ విభాగంలో మరింత పోటీనిస్తుందని, ఇప్పటికే ఈ విభాగంలో ఉన్న హీరో మోటోకార్ప్ వంటి సంస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని భావిస్తున్నారు.