e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News Infant crying | చిన్న పిల్ల‌లు ఎందుకు ఏడుస్తారు?

Infant crying | చిన్న పిల్ల‌లు ఎందుకు ఏడుస్తారు?

Infant crying | ఏడుపు.. నవజాత శిశువు చేసే మొదటి శబ్దం. పసిబిడ్డ శ్వాస సరిగ్గా తీసుకుంటూ, ఆరోగ్యంగా ఉందనడానికి సంకేతం. శిశువు మాట్లాడలేదు. తనకు తెలిసిన ఏకైక భాష ఏడుపే. దాని అర్థాలు అనేకం. అవసరాలు, అసౌకర్యాలు తెలిపే మార్గం కూడా ఇదే. ఏడుపు ఒకరకమైన సంభాషణ.

Infant crying
Infant crying

తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉంటూ.. గుండె చప్పుడు వింటూ.. తగిన ఉష్ణోగ్రత ఉన్న నీటిలో ఈదులాడిన శిశువు.. ఒక్కసారిగా బయటి వాతావరణానికి అలవాటు పడటానికి మూడు నెలల సమయం పడుతుంది. శిశువులు మొదటి 3 నెలలూ రోజూ కనీసం గంట నుంచి నాలుగు గంటలు ఏడుస్తూనే ఉంటారు. తొలి 4 వారాలు కన్నీరు రావడం అరుదు. 6 వారాలపాటు ఏడుపు క్రమంగా పెరిగి, ఆ తరువాత తగ్గుముఖం పడుతుంది. ప్రతి శిశువూ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. ఏ ఇద్దరు బిడ్డలూ ఒకేలా ఉండరు. శిశువులు మొదటి 4-6 వారాలు ఉదయం నిద్రపోతూ, రాత్రి ఎక్కువగా మేల్కొంటారు. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పటి ప్రవర్తనకు కొనసాగింపే. ఏడుపునకు ప్రధాన కారణం ఆకలి. కానీ ఏడ్చిన ప్రతిసారీ ఆకలే అనుకోవడం పొరపాటు. శిశువుకు ఆకలితో పాటు ఇతర అవసరాలూ ఉంటాయి.

- Advertisement -

వాతావరణం అతి వేడిగా ఉన్నా, అతి చల్లగా ఉన్నా, మూత్రంతో బట్టలు తడిసినా, బట్టలు బిగుతుగా ఉన్నా, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినా, కంట్లో ఎక్కువ వెలుతురు పడుతున్నా.. ఇలా అనేక కారణాల వల్ల శిశువులు ఏడుస్తుంటారు. కొందరు మూత్రం పోసే ముందు, విరేచనం చేసే ముందు కూడా ఏడుస్తుంటారు.

నొప్పి వల్ల కాదు..

బిడ్డ ఏడ్చిన ప్రతిసారీ కడుపు నొప్పి కారణమేమో అనుకుంటారు. కానీ ఇది తప్పు. బాగా ఏడ్చినప్పుడు శిశువు కడుపు గాలితో నిండి ఉబ్బుతుంది. ఈ మార్పు ఏడ్పు వల్ల వచ్చేదే గానీ, ఏడ్పునకు కారణం కాదు. పాలు తాగుతున్నప్పుడు కూడా కొందరు పిల్లలు ఏడుస్తుంటారు. దీనికి కారణం, రొమ్ముతో ముక్కు మూసుకుపోవడం, రొమ్ము మొన నోటికి సరిగా అందకపోవడం. కాబట్టి, పాలు తాగించే ముందు తల్లి సరిగా కూర్చొని, శిశువును రొమ్ము దగ్గరికి ఉండే విధంగా హత్తుకొని, ముక్కు మూసుకొని పోకుండా చూపుడు వేలు, మధ్య వేలుతో పట్టుకోవాలి.

జలుబుతో ముక్కుమూసుకొని పోవడం వల్ల కూడా శిశువులు సరిగా పాలు తాగలేరు. దీంతో ఏడుపు మొదలు పెడతారు. పాలు తాగే ముందు ముక్కు శుభ్రం చేస్తే, ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి. ఏడుపు తగ్గుతుంది. కొందరు పిల్లలు తల్లికన్నా, తండ్రి లాలించినప్పుడే ఏడుపు ఆపుతారు. వీరికి మగవారి స్వరాలే ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మరికొందరు తల్లి స్పర్శ తగలగానే, తల్లి మాట వినగానే ఏడుపు ఆపేస్తారు. ఇక బిడ్డలకు ఎంత నిద్ర సరిపోతుందనే విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. మొదటి నెలలో ఏకబిగిన 5 గంటలకన్నా ఎక్కువ నిద్రిస్తే డాక్టరుకు చూపించాలి. మెదడు అభివృద్ధి చెందుతున్న కొద్దీ శిశువులు క్రమపద్ధతిలో పాలు తాగడం, నిద్రపోవడం నేర్చుకుంటారు.

డాక్టర్‌ కర్రా రమేశ్‌రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

త‌ల్లి పాల‌కు, ఇత‌ర పాల‌కు తేడా ఏంటి.. పరిశోధనల్లో ఏం తేలింది ?

Omicron | ఒమిక్రాన్ పిల్ల‌లపై ప్ర‌భావం చూపిస్తుందా? ఈ వేరియంట్ ల‌క్ష‌ణాలేంటి?

పిల్లలు ఎక్కడ సంతోషంగా ఉంటారు? అమ్మ ద‌గ్గ‌రా? అమ్మ‌మ్మ‌, నాన‌మ్మ‌ల ద‌గ్గ‌రా?

Children Health | చిన్న‌పిల్ల‌ల్లో శ్వాస‌కోశ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం ఇవ్వాలి..?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement