వాషింగ్టన్ : సాధారణంగా 9 నెలలు నిండిన తర్వాతనే మనిషి జననం సాధ్యపడుతుంది. కొన్నికొన్నిసార్లు నెలలు నిండక ముందే జన్మించడం కూడా చూస్తుంటాం. అయితే, ఇలాంటి వారు పుట్టిన కొన్నిరోజులకే చనిపోతుంటారు. అలాంటిది నాలుగున్నర నెలలకే శిశువు జన్మించడం అసాధ్యం. తల్లి గర్భంలో 4 నెలలకు పిండం అప్పుడే ఒక రూపానికి వస్తుంటుంది. అయితే, అమెరికాలోని ఓ తల్లి నాలుగున్నర నెలల్లోనే శిశువుకు జన్మనిచ్చి వైద్యరంగాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి శిశువులు మనుగడ సాగించడానికి సున్నా శాతం అవకాశం లేనప్పటికీ.. ఈ శిశువు మాత్రం రెండు రోజుల క్రితం తన తొలి పుట్టినరోజును జరుపుకున్నాడు. పుట్టినప్పుడు 338 గ్రాములు ఉన్న ఈ శిశువు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మొదటి ఏడాది పూర్తిచేసుకోవడం పట్ల వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో జన్మించిన ఈ బాబు పేరు రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్. ఇంత తక్కువ రోజుల్లో పుట్టిన ప్రపంచంలో మొట్టమొదటి బిడ్డగా గిన్నిస్ రికార్డ్స్‌లో నమోదైంది. సాధారణంగా 270 రోజుల తర్వాత శిశువు జన్మిస్తుంది. దానికి విరుద్ధంగా రిచర్డ్ కేవలం 139 రోజులకే జన్మించాడు. నాలుగున్నర నెలలకే పుట్టిన తమ కుమారుడు అనేక శారీరక అవరోధాలను అధిగమించాడని, ఎక్కువ రోజులు బ్రతుకడం కష్టమని తెలిసినా.. బాబే లోకంగా జీవిస్తున్నారు. రిచర్డ్ ఇతర పిల్లల మాదిరిగానే సాధారణంగా, ఆరోగ్యకరంగా ఉన్నాడు. పుట్టిన ఆరు నెలల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఇలాంటి శిశువులు మొదటి పుట్టిన రోజు జరుపుకోవడం చాలా అరుదుగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. నాలుగున్నర నెలలకే పుట్టే శిశువుల మనుగడ సాధించడం చాలా కష్టమని, అయితే ఇన్నిరోజులు బ్రతికి ఉండటం అద్భుతమే అంటున్నారు వైద్యులు.
ఎంతో అరుదుగా జరిగే అద్భుతం తమకే జరుగడం, ఆరోగ్యంగా ఉండటం చూస్తే ఇక చావు అతడి దరిదాపుల్లోకి రాదని అనిపిస్తున్నదని తల్లిదండ్రులు రిక్, బెత్ అంటున్నారు. 139 రోజులకే పుట్టి తమ కుమారుడు రిచర్డ్ ప్రపంచ రికార్డు సృష్టించాడని, ఈ రికార్డు సృష్టించినందుకు మేము ఆశ్చర్యపోతున్నామని వారంటున్నారు. అర చేతిలో ఇమిడేంతగా ఉన్న తమ కుమారుడు ఇలాగే ఇంట్లో ఆడుకోవాలని ఆశిస్తున్నాట్లు తల్లిదండ్రులు చెప్తున్నారు.
సైనికులతో కలిసి శునకాల యోగాసనాలు.. ఎక్కడంటే..?
చరిత్రలో ఈరోజు : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
ఆఫ్ఘాన్‌లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేస్తాం : తాలిబాన్ ప్రకటన
రామ మందిరం విషయంలో మా ఎంపీవన్నీ అబద్దాలే
ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్లో మార్పులు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..