అవికాగోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టెన్త్‌క్లాస్ డైరీస్’.‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అచ్యుత రామారావు, పి.రవితేజ నిర్మాతలు. ఈ సినిమాలోని ‘సిలకా..సిలకా..రామా సిలకా..ఏదో ఉందే మెలికా..’ అనే ఐటెమ్‌సాంగ్‌ను శనివారం విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్నందించిన ఈ గీతాన్ని రేవంత్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ రచించారు. ‘ఈ పాట సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 26న టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. పదోతరగతి రోజుల్లోని జ్ఞాపకాలకు దృశ్యరూపంగా సాగే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: ‘గరుడవేగ’ అంజి.