సంగారెడ్డి : నడిరోడ్డుపై వేగంగా కదులుతున్న ఆటోపై నిల్చున్నాడు ఓ యువకుడు. ఇక పుష్ప మూవీలో అల్లు అర్జున్ మాదిరి తగ్గేదేలే అని డైలాగ్‌ను అనుకరించాడు. ఈ రకంగా ఓవర్‌యాక్షన్ చేసినందుకు అతనికి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద జూన్ 24న చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆటో ఓనర్ ఎం సాయిలు తన ఆటోపై ఎక్కాడు. ఆటోను మరో స్నేహితుడు నడుపుతున్నాడు. వేగంగా కదులుతున్న ఆటోపై ఎక్కిన సాయిలు.. పుష్ప మూవీలో అల్లు అర్జున్ మాదిరి తగ్గేదేలే అని డైలాగ్‌ను అనుకరించాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనను గమనించిన నారాయణ్‌ఖేడ్ పోలీసులు సీరియస్‌గా స్పందించారు. రాములు ఆటోకు రూ. 1600 జరిమానా విధించారు. ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినందుకు రూ. 1000, నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 500, ఆటోపై ప్రయాణించినందుకు రూ. 100 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.