టాలీవుడ్ నటుడు రానా నటిస్తోన్న తాజా ప్రాజెక్టు హాథి మేరే సాథి. తెలుగులో అరణ్య టైటిల్‌తో విడుదల కాబోతుంది. మార్చి 26న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సందర్బంగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో రానా పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు.
టిక్కెట్ కొనుక్కొని థియేటర్‌లోపలికి వెళ్లిన తర్వాత చిత్ర నిర్మాత ఎక్కడి నుంచి వచ్చాడన్న విషయం మీరు (ప్రేక్షకులు) పట్టించుకోరు. కేవలం సినిమాపైనే శ్రద్ద పెడతారు. ఇంటర్నెట్, ప్రెస్ భాషా సరిహద్దులను పెద్ద స్థాయిలో తొలగించాయి. అవెంజర్స్ సినిమా హిందీ, తెలుగు, ఇతర భాషనా అని ఏమి పట్టించుకోరని చెప్పుకొచ్చాడు రానా. మా తాత వల్ల నాకు కొంత చరిత్ర తెలుసు. చెన్నైలో అన్ని భాషల చిత్రాల షూటింగ్ పూర్తి చేసిన సమయంలో..టాలెంట్ ను మార్చడం తప్ప అక్కడి పరిశ్రమలో ఎప్పుడూ పెద్దగా తేడా లేదు. మీరు ఏ భాషకు చెందిన డైరెక్టరా, నటుడా..? అన్నది సంబంధం లేని కళ ఫిల్మ్ మేకింగ్ . కళ నిజంగా ఏకమవుతుంది..అంటూ చెప్పాడు రానా.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.