ముంబై ,జులై :ఆడి ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలో ఈ-ట్రాన్50, ఈ-ట్రాన్55 ,ఈ -ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ వంటి మూడు వేరియంట్లు ఉన్నాయి. ఈ-ట్రాన్50 ధర రూ.99,99,000 కాగా, ఈ-ట్రాన్ ధర రూ. 1,16,15,000 వరకు ఉంటుంది. ఈ -ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ ధర అక్షరాలా రూ. 1,17,66,000. 9 రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ‘టైఫూన్ గ్రే, సియామ్ బీజ్, మిథోస్ బ్లాక్, గ్లాసియర్ వైట్, గెలాక్సీ బ్లూ, ఫ్లోరెట్ సిల్వర్, కాటలున్యా రెడ్, నవరా బ్లూ కలర్స్. ఇందులో ప్లాస్మా బ్లూ కలర్ కేవలం స్పోర్ట్‌బ్యాక్ లో మాత్రమే ఉంటుంది.
కొత్త ఆడి ఈ-ట్రాన్ ఎస్యూవీ, స్పోర్ట్‌బ్యాక్ డిజైన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అవి రూప్ అండ్ బ్లాక్-అవుట్ విండో లైన్. ఇవి కాకుండా మిగిలిన ఫీచర్స్ అన్ని దాదాపు ఒకేలా ఉంటాయి. ఇందులో మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్లు, బూట్-లిడ్ పై ఎల్ఈడీ బార్, ఎల్ఈడీ టైల్ లాంప్స్, 20-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఇరువైపులా ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి. ఆడి ఈ-ట్రాన్ ఇంటీరియర్ కూడా చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ అండ్ క్లైమేట్ కంట్రోల్ కోసం మూడు స్క్రీన్లు ఉన్నాయి. ఇందులో ఎంటర్టైన్మెంట్ కోసం అనుకూలంగా ఉండే ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఇవి మాత్రమే కాకుండా ఇందులో ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వాయిస్-అసిస్టెంట్, మై ఆడి కనెక్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్ప్లే, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే , మౌంటెడ్ కంట్రోల్స్‌తో ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఆడి క్వాట్రో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్, రీజనరేటివ్ బ్రేకింగ్ , ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి వాటిని కూడా ఇది కలిగి ఉంటుంది. మొదట ఆడి ఈ-ట్రాన్50 విషయానికి వస్తే, ఇది 71kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 308 బిహెచ్పి పవర్, 540 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 6.8 సెకన్లలో 100 కిమీ వరకు వేగంతో వెళుతుంది.
ఆడి ఈ-ట్రాన్50 గరిష్ట వేగం గంటకు 190 కి. మీ. అదేవిధంగా ఆడి ఈ-ట్రాన్55 95kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 402 బిహెచ్పి పవర్ , 664 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కేవలం 5.7 సెకన్లలో 100 కి. మీ వరకు వేగం వెళుతుంది. ఆడి ఈ-ట్రాన్55, గరిష్ట వేగం గంటకు 200 కిమీ వరకు ఉంటుంది. ఆడి ఈ-ట్రాన్ 7 వేర్వేరు డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతి మోడ్ వాహనదారునికి డ్రైవింగ్ విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో 8 ఎయిర్‌బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, ఎబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్ అండ్ ప్రీ-సెన్స్ బేసిక్ వంటివి ఉన్నాయి.