జనగామ : శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న మనుషులు మూఢ నమ్మకాలను వదలడం లేదు. మంత్ర, తంత్రాల పేరుతో అమాయకులపై దాడి చేసి హతమారుస్తారుస్తున్నారు. తాము నేరస్థులుగా మారుతూ తమ కుటుంబ సభ్యులక కూడా తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.
తాజాగా జిల్లాలోని జఫర్ ఘడ్ మండలం తీగారం గ్రామంలో మంత్రాల నెపంతో ఓ కుటుంబం దాడికి పాల్పడ్డారు. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన గోరేమియా కుటుంబం మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు.
కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. గ్రామస్తులు నిలువరించడంతో గోరేమియా, కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.