నిర్మల్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం, శుభం తెలియని మూడున్నరేండ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన భైంసా మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై 18 ఏండ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారికి రక్తస్రావం అవడం గమనించిన కుటుంబ సభ్యులు భైంసా రూరల్ పోలీస్లను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.