e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News లేటెస్ట్ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ సిరీస్‌ను విడుదల చేసిన అసుస్‌…

లేటెస్ట్ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ సిరీస్‌ను విడుదల చేసిన అసుస్‌…

లేటెస్ట్ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ సిరీస్‌ను విడుదల చేసిన అసుస్‌…

హైదరాబాద్, మే 31 : అసుస్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ గేమ్స్‌ (ఆర్‌ఓజీ) తమ తాజాశ్రేణి ల్యాప్‌టాప్‌లు భారతదేశంలో విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇవి అత్యాధునిక ఏఎండీ రిజెన్‌ 5000 హెచ్‌ సిరీస్‌ మొబైల్‌ ప్రాసెసర్లను కలిగి ఉంటాయి. అంతేకాదు ఉత్పాదకతను మెరుగుపరిచే రీతిలో , గేమింగ్‌ అనుభవాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే రీతిలో తీర్చిదిద్దిన ఈ నూతన శ్రేణి ల్యాప్‌టాప్‌లలో డిటాచబుల్‌ ఈజీపీయు(ఎక్స్‌జీ మొబైల్‌) మద్దతుతో వచ్చే ఆర్‌ఓజీ ఫ్లో ఎక్స్‌13 తో పాటుగా ఆర్‌ఓజీ జెఫిరస్‌ డ్యూయో 15 ఎస్‌ఈ ; ఆర్‌ఓజీ జెఫిరస్‌ జీ15 , ఆర్‌ఓజీ జెఫిరస్‌ జీ14 ఉన్నాయి. సౌకర్యమే నూతన ప్రభావం (కంపాక్ట్‌ ఈజ్‌ ద న్యూ ఇంపాక్ట్‌ ) సిద్ధాంతాన్ని ప్రతిధ్వనించే రీతిలో ఈ తాజా గేమింగ్‌ శ్రేణి వైవిధ్యతను గేమర్లకు ల్యాప్‌టాప్‌ గేమింగ్‌ వాతావరణంలో పలు అవకాశాలను అందిస్తుంది. ఈ గేమింగ్‌ పీసీలు తాజా శక్తివంతమైన ఏఎండీ రిజెన్‌ 9 5900 హెచ్‌ఎస్‌ ,రిజెన్‌ 9 5900 హెచ్‌ఎక్స్‌ ప్రాసెసర్‌ అండ్ నివిడియా జీఫోర్స్‌ జీపీయుతో వస్తాయి. ఇవి వినియోగదారులకు గేమింగ్‌ అనుభవాలను మరింతగా వృద్ధి చేస్తాయి. ఈ మెషీన్లను పోటీ టోర్నమెంట్లలలో రాజీలేని గేమింగ్‌ అనుభవాలను ఔత్సాహికులు, స్పోర్ట్స్‌ ప్లేయర్లకు అందించే రీతిలో తీర్చిదిద్దారు.

ప్రతిష్టాత్మక ఆర్‌ఓజీ ఫ్లో ఎక్స్‌13, సౌకర్యవంతమైన 13 అంగుళాల, 13. కేజీల ఛాసిస్‌తో శక్తి మరియు అలా్ట్ర పోర్టబిలిటీ నడుమ ఖచ్చితమైన సమతుల్యతను నిర్వహిస్తుంది. ఇది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 13 అంగుళాల కన్వర్టబుల్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌. దీనిని అత్యంత సౌకర్యవంతంగా పలుచటి 360 డిగ్రీ ఎర్గోలిఫ్ట్‌ హింజ్‌తో మార్చుకోవచ్చు. ఇది ల్యాప్‌టాప్‌ను పలు అవసరాలకు తగినట్లుగా విభిన్న మోడ్స్‌లో వినియోగించుకునే అవకాశం అందిస్తుంది. ఆర్‌ఓజీ ఫ్లో ఎక్స్‌ 13 ల్యాప్‌టాప్‌లు డిటాచబుల్‌ ఈజీపీయు, ఎక్స్‌జీ మొబైల్‌తో వస్తుంది.

ప్రత్యేకమైన పీసీఐఈ 3.0X8 ఇంటర్‌ఫేజ్‌తో శక్తివంతమైన ఈ ల్యాప్‌టాప్‌ పనితీరు, కనెక్టివిటీ శక్తిని అందిస్తుంది. ఇంటిగ్రేటెడ్‌ అడాప్టర్‌,మల్టీపుల్‌ ఐ/ఓ పోర్ట్స్‌ వంటివి ఫ్లో ఎక్స్‌13ను అసలైన ఫ్లెక్సిబల్‌ ల్యాప్‌టాప్‌గా గేమర్లకు మారుస్తుంది. అంతేకాదు కంపాక్ట్‌ ల్యాప్‌టాప్‌తో ప్రభావాన్నీ చూపుతుంది. అంతేకాదు, ఇది ఏఎండీ రిజెన్‌ 9 5900 హెచ్‌ఎస్‌ ప్రాసెసర్‌తో వస్తుంది. దీనిలో గత జెనరేషన్‌తో పోలిస్తే 19%కు పైగా అదనపు పనితీరు ఉంది. అలాగే నివిడియా జీఫోర్స్‌ జీటీఎక్స్‌ 1650 జీపీయు ఈ ఆర్‌ఓజీ ఫ్లో ఎక్స్‌ 13ను వైవిధ్యంగా నిలుపుతూనే వర్క్‌లోడ్స్‌, మల్టీటాస్కింగ్‌ను చేరుకునేందుకు సైతం తోడ్పడుతుంది. టిల్టెడ్‌ 13 డిగ్రీలు సౌకర్యవంతమైన వీక్షణను అందిస్తుంది. అయితే ఎక్స్‌జీ మొబైల్‌ వెర్షన్‌ రాబోయే కొద్ది నెలల్లో రానుంది. ఆర్‌ఓజీ ఫ్లో ఎక్స్‌ 13 ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతుంది.

లేటెస్ట్ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ సిరీస్‌ను విడుదల చేసిన అసుస్‌…

జెఫిరస్‌ శ్రేణిలో బాగంగా ఆర్‌ఓజీ జెఫిరస్‌ డ్యూయో 15 ఎస్‌ఈను వినియోగదారుల సమగ్రమైన అవసరాలను తీర్చే రీతిలో రూపొందించారు. ఇది గేమింగ్‌ మొదలు కంటెంట్‌ క్రియేషన్‌, కోడింగ్‌ వరకూ అన్నిటికీ మద్దతునందిస్తుంది. ఇది తాజా ఏఎండీ రిజెన్‌ 9 5900 హెచ్‌ఎక్స్‌ ప్రాసెసర్‌, జీఫోర్స్‌ ఆర్‌టీఎక్స్‌ 3080 జీపీయుతో మరింత వేగంగా మారుతుంది. ఈ ల్యాప్‌టాప్‌ అంతర్గతంగా నిర్మించిన ఆర్‌ఓజీ స్ర్కీన్‌ప్యాడ్‌ ప్లస్‌ సెకండరీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మల్టీటాస్కింగ్‌ను సైతం అత్యంత సులభతరంగా మార్చడంతో పాటు యాప్స్‌ను సైతం ఆప్టిమైజ్‌ చేసి మీ వర్క్‌ఫ్లోను వృద్ధి చేస్తుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లేటెస్ట్ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ సిరీస్‌ను విడుదల చేసిన అసుస్‌…

ట్రెండింగ్‌

Advertisement