న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెటైరికల్ ట్వీట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్, కేజ్రీవాల్ మధ్య గత కొద్ది రోజుల నుంచి మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కేజ్రీవాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ప్రతి రోజు లెఫ్టినెంట్ గవర్నర్ తిట్టినన్ని తిట్లు కూడా, నా భార్య తిట్టలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత ఆరు నెలల నుంచి నా భార్య కూడా అన్ని ప్రేమలేఖలు రాయలేదు.. కానీ ఎల్జీ సాబ్ మాత్రం ఎన్నో ప్రేమ లేఖలు రాశారు. ఎల్జీ సాబ్ చిల్ అవ్వండి. అదే విధంగా మీ బాస్‌ను కూడా కొంచెం చిల్ అవ్వమని చెప్పండి అని కేజ్రీవాల్లో హిందీలో ట్వీట్ చేశారు.
LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं।
पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे।
LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022