అతనికి సినిమా నేపథ్యం లేదు..కానీ సినిమాలంటే పిచ్చి.. ఏనాడూ నటుడిని అవుతానని అనుకోలేదు. కానీ చదువులు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల వేటకై నగరం గడపతొక్కిన అతడు ఇప్పుడు అనుకోకుండా సెలబ్రిటీగా మారిపోయాడు. అలా అని అతనిది నాటక రంగ నేపథ్యమూ కాదు. కానీ అతడిని వెండితెరకు పరిచయం చేసింది నాటకరంగమే మరి. నటనలో అ ఆలు కూడా రాని అతనికి నాటకమే పెద్ద నటులతో కలిసి నటించే చాన్స్ తెచ్చిపెట్టింది. ఇంతకీ అతనెవరో చెప్పలేదుగదా.. సైరా, ఆకాశవాణి, పుష్ప సినిమాలో మెరిసిన తెలంగాణ బిడ్డ అజయ్ మంకెనపల్లి. త్వరలో విడుదల కానున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమా బీమ్లానాయక్లోనూ కనిపించనున్న అజయ్ తనకు సినిమా అవకాశాలు ఎలా వచ్చాయో నమస్తే తెలంగాణతో చెప్పారు..ఆ ముచ్చట్లేంటో విందాం పదండి..