e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News హత్యలకు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్‌

హత్యలకు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్‌

హైదరాబాద్‌ : నగరంలో హత్యలకు పాల్పడుతున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్‌ డీసీపీ పద్మజ బుధవారం నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారానికి చెందిన స్వామి, నర్సమ్మ అనే దంపతులు కూలీ పనులను ఇప్పిస్తామంటూ నమ్మబలికి హత్యలకు పాల్పడుతున్నారు. అనంతరం వారి నుంచి ఆభరణాలు, నగదు దోచుకెళ్తున్నారు. ఈ నెల 25న మల్లాపూర్‌లో మహిళా కూలీ అదృశ్యమైంది. నిందితులిద్దరూ సదరు మహిళా కూలీకి పని కల్పిస్తామని తీసుకెళ్లి హత్య చేశారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, ఫోన్‌ ఎత్తుకు వెళ్లారు. హత్యపై కేసుపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి నలుగురిని హత్య చేసినట్లు అంగీకరించారన్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించనున్నట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి..

కొవిషీల్డ్‌ రెండో డోసు తర్వాత ఆ సమస్య ఉండదు..!
దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు
Bharti Arora | ‘శ్రీకృష్ణుడి సేవ’ కోసం ఐపీఎస్‌కు రాజీనామా..
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana