టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి పుష్ప సినిమా కోసం ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్‌తో కుర్రకారు మతులు పోగొట్టేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమైంది. ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ మత్తు వాయిస్‌తో పాడిన ఈ పాట శ్రోతలను తెగ ఆకట్టుకుంటుంది. ఇంద్రావతి చౌహాన్ వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. సమంత స్టెప్పులు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
నెట్టింట్లో ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సాంగ్ మగాళ్లను కించపరిచేలా ఉందంటూ ఏపీలోని పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది. పాటలోని లిరిక్స్ వలన పురుషుల పై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది. పాటపై నిషేదం విధించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది పురుషుల సంఘం.
అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఈ సాంగ్‌కి సామాన్యులతో పాటు సెలబ్రిటీల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. బిగ్ బాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ ఈ పాటకు తనదైన స్టైల్లో చిందులేసింది. రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్17న రిలీజ్ కానుంది.
https://www.instagram.com/reel/CXZB3-kgZN3/?utm_source=ig_web_copy_link