1.ఎగిలివారంగ = వెలుగులు పారగ (సూర్యోదయం)
(అరేయ్ మామా! ఆ పిల్ల మస్తు పనికల్లది రా. ఎగిలివారంగనె లేసి.. వాకిట్ల వూడ్సి, సానుపు చల్లి,
ముగ్గులు పెడతది, పనిజూస్కొని చదువుకెళ్తది)
2. తప్పడ వాన = ఎండకాసేటప్పుడు పటపట కొట్టి వెలిసిపోయే వాన (‘మాంచి ఎండలో తప్పడవాన పడ్డదంటే కాకికి
పెండ్లిసుతా అయితుందేమో..’ అనేవాళ్లు అప్పట్లో)
3. సుక్కపొడుపు = బ్రాహ్మీ ముహూర్తం (రెండున్నర మూడున్నర నడుమ) (రేయ్.. లేకలేక పెండ్లయింది.
సుక్కపొడుపుకే పంతులయ్య ముహూర్తం పెట్టిండు.
అప్పటి వరకు ఆగు.)
4. సుద్దపూస = శుద్ధమైనవాడు (ఇదొక వ్యంగ్యార్థం)
(అరేయ్ రాజుగా.. చిన్నప్పటిసంది చేసిన తప్పులన్నీ చేసి..
ఇప్పుడు సుద్దపూసలెక్క మాట్లాడొద్దు)
5. పొక్కిలి = నేలలో చిన్నచిన్న గుంతలు పడటం (పొద్దట్నుంచి ఒకటే ఆటలా..? వాకిలి మొత్తం పొక్కిలి
పొక్కిలి అయింది. నీళ్లు జల్లి, వాకిలుడువ్ జల్ది)