టాలీవుడ్ యాక్టర్ దగ్గుబాటి రానా నటిస్తున్న ప్రాజెక్టు అరణ్య. ఏనుగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న క్రమంలో వాటిని ఎలా రక్షిస్తాడనే ఇతివృత్తంతో సాగుతున్న ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇదిలాఉంటే అరణ్యలో వెంకటేశ్ కూడా భాగస్వామ్యం కూడా అయ్యాడు. అదేంటీ వెంకీ ట్రైలర్ లో వెంకీ ఎక్కడా కనిపించలేదు కదా అనుకుంటున్నారా..? అవును కనిపించలేదు కానీ వినిపించాడు. ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు వెంకీ. రానా తండ్రి పాత్రకు వెంకీ వాయిస్ ఇవ్వడం ట్రైలర్ లో గమనించవచ్చు.
బుధవారం రాత్రి వెంకీ అరణ్య ట్రైలర్ ను షేర్ చేస్తూ..ఇది అద్బుతంగా కనిపిస్తుంది అని ట్వీట్ చేశాడు. దీనికి రానా స్పందిస్తూ..అరణ్యలో నా తండ్రి పాత్రకు బాబాయి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకమైనదిగా చేసిన బాబాయికి ధన్యవాదాలు…అని పోస్ట్ పెట్టాడు. అయితే తండ్రి పాత్రలో ఎవరు నటించాడనేది మాత్రం చెప్పలేదు రానా. సినిమా విడుదలైతే రానా తండ్రి పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై స్పష్టత రానుంది.
ప్రభు సోలోమన్ డైరెక్షన్లో వస్తున్న చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావ్ంకర్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో మార్చి 26న విడుదలవుతుంది.