యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతుంది. పలువురు సెలబ్రిటీలు,అభిమానులు ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ప్రభాస్ కి మంచి ఫ్రెండ్ అలాగే తన కో స్టార్ హీరోయిన్ అనుష్క కూడా స్పెషల్ విషెష్ ని తెలియజేసింది. ప్రతి అంశంలో ప్రభాస్ బెస్ట్‌గా ఉండాలని, తన స్టోరీస్ అన్ని విజయవంతం అయి అందరి హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నట్టు అనుష్క పేర్కొంది.
మిర్చి,బాహుబలి చిత్రాలలో కలిసి పని చేసిన ప్రభాస్- అనుష్క తిరిగి పని చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్.. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె , నాగ్ అశ్విన్ చిత్రాలతో పాటు స్పిరిట్ అనే చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి అన్నీ కూడా ప్యాన్ ఇండియా చిత్రాలు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం త్వరలో విడుదల కానుండగా,ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది గంటలలో రాధేశ్యామ్ చిత్ర టీజర్ విడుదల కానుండగా, దీని కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.