ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్ ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). అక్టోబర్ 13న విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్ర షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇందులో నటించిన స్టార్స్ బర్త్‌డేలను పురస్కరించుకొని వారు పోషించిన పాత్రల ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తూ ఫ్యాన్స్ ను ఆనందపరుస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, అలియా భట్, ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్ పాత్రలను పరిచయం చేసిన జక్కన్న ఇప్పుడు అజయ్ దేవగణ్ ఫస్ట్ లుక్కు టైం ఫిక్స్ చేశాడు.
ఏప్రిల్ 2న అజయ్ దేవగణ్ బర్త్‌డే కావడంతో ఈ సందర్బంగా ఆర్ఆర్ఆర్ నుండి అజయ్ ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు మేకర్స్ కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. ఇప్పటి వరకు చూడనటువంటి పాత్రలో అజయ్‌ను చూడనున్నారని మేకర్స్ తెలియజేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు గురువుగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో కనిపించనున్నాడని సమాచారం. చిత్రంలో సముద్రఖని, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.