Baby Scrubber | చిన్నారులకు స్నానం చేయించడం అన్నది అమ్మలకు అన్నిటికన్నా కష్టమైన పని. తినేందుకూ, నిద్రపోయేందుకూ గోల చేయని పిల్లలు కూడా స్నానం పేరు వినగానే ఏడుపు లంకించుకుంటారు. పసికందులు మొదలు మూడు నాలుగేళ్ల బిడ్డల దాకా ఇదే పరిస్థితి. అమ్మల ఇబ్బందిని గమనించే.. చిన్న పిల్లల స్నానం కోసం ‘యానిమల్ ఫేస్ బేబీ బాత్ స్క్రబర్లు’ అందుబాటులోకి తెచ్చారు తయారీదారులు. పిల్లల్ని ఆకర్షించేలా బొమ్మల ఆకృతిలో రూపొందుతున్నాయి ఇవి.
మనం మామూలుగా స్నానానికి వాడే స్క్రబర్లలాంటి వాటికే బాతు, ఎలుగుబంటి, కుందేలు, కప్పలాంటి జంతువుల బొమ్మల్ని జోడించి ఆకట్టుకునేలా తయారుచేస్తారు. వీటిలో కొన్నిటిని అయితే గ్లౌజులా తొడుక్కోవచ్చు. మరి కొన్నిటిని సాధారణ బాత్ స్పాంజిల్లానే చేతితో పట్టుకుని వాడుకోవచ్చు. రకరకాల రంగుల్లో, ఆకర్షణీయమైన రూపాల్లో కనిపిస్తున్న వీటిని చూస్తే ఎంత అల్లరి పిల్లలైనా సరే స్నానానికి పరుగెత్తుకు రావల్సిందే. ఐడియా బాగుంది కదూ!
“మీ పిల్లల స్కూల్ బ్యాగ్స్, బుక్స్ మీకు నచ్చినట్టు ఇలా ప్రింట్ చేయించుకోండి”