తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)లో ఉన్న అత్యంత విజయవంతమైన దర్శకుల్లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) కూడా ఒకడు. రాజమౌళి తర్వాత ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేదు ఈ దర్శకుడికి. ప్రస్తుతం విడుదలైన ఎఫ్ 3 సినిమా మూడు రోజుల్లోనే 63 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మరో వారం రోజులు ఆగితే కానీ ఈ సినిమా ఫలితం ఏమిటనేది తెలియదు. ప్రస్తుతానికి కలెక్షన్స్ బాగానే రావడంతో అనిల్ రావిపూడి గాల్లో తేలిపోతున్నాడు. ఇదిలా ఉంటే ఈయన హీరోల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
అనిల్ సినిమాలకు దాదాపు 100 కోట్ల మార్కెట్ ఉంది..ఆయనకు కూడా అదిరిపోయే ఇమేజ్ వుంది..పాన్ ఇండియా సినిమాలు (Pan India Movies) చేయగల సత్తా కూడా ఉంది..అయినా కూడా వాటిని కాదని కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చేస్తున్నాడు అనిల్ రావిపూడి. పైగా మిగిలిన దర్శకులంతా స్టార్ హీరోల వెంటపడి పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే..ఈయన మాత్రం సీనియర్ హీరోల వెంట పడుతున్నాడు. దీనికి కూడా ఓ కారణం ఉంది. అనిల్ రావిపూడి అడగాలే కానీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.
కాకపోతే మరో రెండు మూడేళ్ల వరకూ వాళ్లు వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. దాంతో ఇప్పుడు వాళ్ల కోసం కథలు రాసుకుంటూ కూర్చుంటే.. ఎదురుచూపులు తప్ప ఇంకేమీ ఉండవని అనిల్ రావిపూడికి తెలియనిది కాదు. కేవలం ఈ ఒక్క కారణంతో సీనియర్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్నాడు అనిల్. ఇప్పటికే వెంకటేష్ తో 2 సినిమాలు చేసిన ఈ దర్శకుడు..త్వరలోనే బాలకృష్ణ (Balakrishna)తో సినిమా మొదలు పెట్టబోతున్నాడు. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
అవకాశం ఇస్తే చిరంజీవితో కూడా సినిమా చేస్తాను అంటున్నాడు అనిల్ రావిపూడి. సీనియర్ హీరోలు అయితే కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చేస్తున్నారు..పాన్ ఇండియా వైపు అడుగులు వేయడం లేదు. అందుకే అవకాశం వచ్చినప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలను పట్టుకుంటూ.. మిగిలిన సమయాల్లో సీనియర్ హీరోలతో సర్దుకుపోతున్నాడు అనిల్ రావిపూడి.