అమరావతి : ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. కార్మికుల వివరాలు తెలిపేందుకు 0866-243614, +9177803 39884, +919492555089, 89779 25653 నెంబర్లను సంప్రదించాలని కార్మికశాఖ కమిషనర్ రేఖారాణి సూచించారు. ఆప్ఘనిస్థాన్‌లో చిక్కుకున్న ఏపీకి చెందిన కార్మికులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు.