Anchor Sreemukhi | శ్రీముఖి అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడేమో..? తన యాంకరింగ్‌తో మతులు పోగొడుతున్న పటాస్ పిల్ల శ్రీముఖి ఇప్పుడు అందాలతో రెచ్చగొడుతుంది. బుల్లి తెరపై రోజూ కనిపిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పెద్దతెరపై మాయ చేయాలని చూస్తుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా శ్రీముఖికి పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగమ్మాయి కావడంతో ఆటోమేటిక్‌గా మనోళ్లు శ్రీముఖిని తక్కువగా చూస్తున్నారు. అందుకే వెండితెరపై ఫోకస్ పెట్టిన శ్రీముఖి.. అందాల ఆరబోతకు సిద్ధమైంది. తాను యాంకరింగ్ చేస్తోన్న ప్రోగ్రామ్స్‌లో చిట్టిపొట్టి డ్రెస్సుల్లో మెరుస్తూ.. తాను గ్లామర్ షోకు కూడా రెడీ అని హింట్ ఇస్తోంది.
పైగా ఈ మధ్య ఆడియో ఫంక్షన్స్ లోనూ శ్రీముఖి కాస్త హద్దులు దాటేస్తోంది. కొన్నాళ్లుగా ఏకంగా షార్ట్స్‌లో అందాల్ని ఆరబోస్తుంది శ్రీముఖి. తొడలు కనిపించేలా చేసిన ఎక్స్ పోజింగ్ చూసి.. బాబోయ్ ఈ పిల్లేంటి ఇలా రెచ్చిపోతుంది అని ముక్కున వేలేసుకుంటున్నారంతా. ఆ మధ్య హర్షవర్దన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరోయిన్ గా నటించింది శ్రీముఖి. ఈ చిత్రంలో హై రేంజ్ గ్లామర్ షో చేసింది. ఇప్పుడెక్కడికి వెళ్లినా కూడా హాట్ హాట్ సోకులు చూపిస్తూ రెచ్చిపోతుంది శ్రీముఖి. ఈ మధ్య బరువు తగ్గిన ఈ బ్యూటీ.. అందాల ఆరబోత విషయంలో తగ్గేదే లే అంటుంది. హీరోయిన్గా ఛాన్స్ కోసం గ్లామర్ షోకు కూడా సిద్ధమైన శ్రీముఖి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
Sreemukhi | కాటుక కనులతో కవ్విస్తున్న శ్రీముఖి..”