తన అందచందాలతో బుల్లితెరను షేక్ చేస్తున్న గ్లామర్ క్వీన్ అనసూయ. బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై రచ్చ చేస్తుంది అనసూయ. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండ, రవితేజ హీరోగా వస్తోన్న ‘ఖిలాడి’లోనూ కీలక పాత్రలో నటిస్తుంది. ఖిలాడీ చిత్రం ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరపుకుంటుండగా, చిత్రీకరణలో పాల్గొనేందుకు రీసెంట్గా అక్కడికి వెళ్లింది. ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అప్డేట్స్ ఇస్తూ నెటిజన్స్‌ను అలరిస్తుంది అనసూయ. తాజాగా ‘నీలి ఆస్మా’ అనే పాపులర్ హిందీ పాటకు స్లో మోషన్లో వాకింగ్ చేస్తూ వయ్యారాలు పోయిన వీడియోను షేర్ చేయగా, ఇది నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా, ఈ హాట్ బ్యూటీ నటించిన థ్యాంక్ యూ బ్రదర్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.instagram.com/p/CMlz-1zD_kb/?utm_source=ig_web_copy_link