నెట్టింట ఆసక్తికర విషయాలు పంచుకుంటూ.. నెటిజన్లకు స్ఫూర్తినిచ్చే వారిలో బిజినెస్‌మేన్ ఆనంద్ మహీంద్రా ఒకరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆయన.. ఎప్పుడెప్పుడు కొత్త పోస్ట్ పెడతారా? అని ఎదురుచూసే వాళ్లు కోకొల్లలు. కొన్నిరోజుల క్రితం రోడ్డుపై జిమ్నాస్టిక్స్ చేస్తున్న ఒక బాలుడి వీడియోను ఆయన షేర్ చేస్తే.. అది ఎంత వైరల్ అయింతో మనకు తెలిసిందే.
తాజాగా ఆయన మరో పోస్టు పెట్టారు. దానిలో ఒక కాఫీ మగ్గుపై టిక్-టాక్-టో గేమ్ వేసి ఉంది. అదే సమయంలో దానిపైన ‘‘థింక్ అవుట్‌సైడ్ ది బాక్స్’’ అని రాసి ఉంది. బాక్స్ స్పెల్లింగ్‌లో ఉండే ‘ఎక్స్’ (X) సింబల్‌తో గేమ్‌ను కలిపేసినట్లు ఈ చిత్రం చూపిస్తోంది. ఈ ఫొటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘‘నేను ఈ మగ్ కొనుక్కుంటాను.తెలివిగా చేశారు.
ఇలాగే చాలాసార్లు సమస్యలను సమాధానాలు మన ఎకోసిస్టం దాటితేనే దొరుకుతాయి’’ అని రాసుకొచ్చారు. పోస్టు చేసిన క్షణాల్లోనే ఇది వైరల్ అవుతోంది. దీనికి రిప్లైలు ఇస్తున్న చాలామంది తమ వెర్షన్లలో ఇలా ’థింకింగ్ అవుట్‌సైడ్ ది బాక్స్‘ వెర్షన్లనుపోస్టు చేస్తున్నారు.
I’m going to get this mug. Clever. The solution to a problem often lies by joining the dots with something OUTSIDE your own ecosystem… pic.twitter.com/SedGrDN8B9
— anand mahindra (@anandmahindra) August 10, 2022