బీజింగ్: చైనాకు చెందిన చాంగే-5 వ్యోమనౌక చంద్రుడి నుంచి తీసుకువచ్చిన నమూనాలు మన భూమికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. భూగ్రహంపైన డైనోసార్ల అంతానికి కారణమైన ఆస్టరాయిడే చంద్రుడిని కూడా ఢీకొట్టినట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు. చంద్రుడిపైన సేకరించిన నమూనాలు, భూమిపైన కనిపించిన గ్రహశకలం ఉల్కతో సరిపోలడంతో ఈ నిర్ధారణకు వచ్చారు. చంద్రుడి ఉపరితలం నుంచి నుంచి సేకరించిన రెండు బిలియన్ ఏండ్ల కిందటి అతిసూక్ష్మ గ్లాస్ బీడ్స్పై కర్టిన్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించి, ఈ విషయాన్ని తేల్చారు. గ్రహశకలం ఉల్కపై వేడి, పీడనం ప్రభావం వల్ల గ్లాస్ బీడ్స్ ఏర్పడ్డాయని, వాటి ఏర్పాటు అవి ఏ కాలం నాటివో సూచిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.