e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News అమ్యూజ్‌మెంట్‌ పార్కులు వ్యూహాత్మకంగా మార్పులు చేయాలి

అమ్యూజ్‌మెంట్‌ పార్కులు వ్యూహాత్మకంగా మార్పులు చేయాలి

అమ్యూజ్‌మెంట్‌ పార్కులు వ్యూహాత్మకంగా మార్పులు చేయాలి

హైదరాబాద్,జూలై:ప్రపంచవ్యాప్తంగా అమ్యూజ్‌మెంట్‌ పార్కుల డిమాండ్‌ కోసం ఏమేం చేయాలి..? ప్రపంచం ఇప్పుడు న్యూ-నార్మల్‌గా వ్యవహరిస్తున్న పరిస్థితుల వైపు కొనసాగుతుండగా, వ్యాపారాలు, వినియోగదారులపై ఆధారపడిన పరిశ్రమలు,ఆర్థికంగామానవ వనరుల నిర్వహణ పరంగా చాలా నష్టాలను చవిచూశాయి. వినోద పరిశ్రమతో పాటు పలు వ్యాపారాల భవిష్యత్తును మహమ్మారి ప్రభావితం చేసింది. పలువురు ఆర్థికవేత్తలు,వ్యాపార నిపుణులు అడుగుతున్న ప్రశ్నల్లోమహమ్మారి అనంతరం వినోద ప్రపంచం భవిష్యత్తు ఏమిటి? ‘ప్రపంచంలో సాధారణ పరిస్థితులు’ నెలకొల్పేందుకు వినోద పరిశ్రమలు తీసుకోవలసిన చర్యలు ఏమిటి?

వినియోగదారుల ప్రవర్తనను అంచనా వేయడంఅంత తేలికైన విషయం కాదు. నూతన అనుభవాలు వారికి అందించే సంతృప్తికి అనుగుణంగా వారు వాటిని తమ అక్కున చేర్చుకుంటారు. నూతన ప్రవర్తన జీవితంలోని అన్ని రంగాలకు విస్తరిస్తోంది- మనం ఎలా పని చేస్తాము, ఎలా షాపింగ్ చేస్తాము. మనల్ని మనం ఎలా అలరించుకుంటాము అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు,మహమ్మారి,లాక్‌డౌన్లతో వినోద ప్రపంచం ఓటీటీ ప్లాట్‌ఫారాలకు మాత్రమే పరిమితం అయ్యింది. లాక్‌డౌన్,మహమ్మారితో బయటి ప్రదేశాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించకుండా ప్రతి ఒక్కరినీ కట్టడి చేశాయి.

- Advertisement -

వారాంతాల్లో స్నేహితులు, బంధువులను కలుసుకోవడం,కుటుంబంలో వ్యక్తుల మధ్య సంబంధాల్లో భౌతిక అంతరంపెరిగింది. జీవితం అనేది ఇప్పుడు సాధారణంగాఆఫ్‌లైన్ కనెక్షన్ల కన్నా ఆన్‌లైన్‌లోనే ఎక్కువైంది. ఏదేమైనా, లాక్‌డౌన్,మహమ్మారి అనంతరం బయటి ప్రపంచంలో వినోదానికి ప్రాధాన్యత ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయని వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్అరుణ్ కె చిట్టిలప్పిల్లి అన్నారు.ఇది వినోద ప్రపంచానికి పునర్నిర్వచించిన లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. వినియోగదారుల ప్రాధాన్యత పరిశ్రమలు చూసే విధానంలో తీవ్రమైన మార్పులు చేసుకోవలసి ఉంటుంది.

అమ్యూజ్‌మెంట్‌ పార్కులు వ్యూహాత్మకంగా మార్పులు చేయాలి

భద్రత ఎలా…?

అమ్యూజ్‌మెంట్‌ పార్కులు వినోద ప్రపంచానికి కేంద్రంగా ఉండడంతో మహమ్మారి అనంతరం భద్రత,సురక్షతకు తీసుకుంటున్న చర్యల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన వ్యక్తులు చివరికి అమ్యూజ్‌మెంట్ పార్కుల వంటి ప్రదేశాలకు తమ మనసులను ఉల్లాసపరచుకునేందుకు,ఉల్లాసంగా ఉండేందుకు మార్గాలు అన్వేషించుకుంటారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పురోగతి,ఏఐ-ఆధారిత విధానాలతో,సురక్షిత చర్యలు నూతన శిఖరాలకు చేరాయి. టీకా డ్రైవ్‌తో మన దేశం ముందుకు కొనసాగుతున్నందున,తల్లిదండ్రులు 18ఏండ్లు పైబడిన తమ పిల్లలు టీకా వేయించుకునేలా ప్రోత్సహించాలి. ఇది మూడవ వేవ్ నియంత్రణకు సహకరిస్తే, కొవిడ్ పరిస్థితులపై ప్రభావం చూపడమే కాకుండా పిల్లలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. మహమ్మారి అనంతరం సందర్భాల్లో వినియోగదారుని సంతృప్తి అవసరాలను పునరుద్ధరించబడిన కఠినతతో, వినోద పరిశ్రమలో భద్రతా చర్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

పర్యావరణసంబంధిత కార్యకలాపాల్లో ఎక్కువ మంది పాల్గొంటారు. అమ్యూజ్‌మెంట్ పార్కులు ఈ అవసరాలను పరిష్కరించేందుకు పెద్ద పీట వేయాలి. ఎక్కువ మంది భాగస్వాములు పాల్గొనేందుకు అనువుగా స్థలం,వాతావరణాన్ని కల్పించాలి. వినోదభరితమైన ఆటలతో పాటు ప్రకృతిఒడిలో ఉండే అమ్యూజ్‌మెంట్‌ పార్కులు సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఆరోగ్యం,పరిశుభ్రత, సహజ వనరుల సంరక్షణ, పరిరక్షణ, వినియోగదారునికి సంతృప్తి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది.

అమ్యూజ్‌మెంట్ పార్కుల డిమాండ్‌ ప్రారంభమయ్యేందుకు మరికొంత సమయం పడుతుంది. వేగవంతమైన మార్పు చాలా అద్భుతంగా అనిపించినప్పటికీ,ప్రజల్లో నిరంతరం ఆసక్తి వృద్ధి చెందుతోంది. వినోద పరిశ్రమలు, ముఖ్యంగాఅమ్యూజ్‌మెంట్‌ పార్కులు వినియోగదారుల ప్రవర్తనకు సంబంధించిన అభిరుచులను తెలుసుకోవాలి.వారి సంతృప్తిని కాపాడేందుకు మెరుగైన, చురుకైన చర్యలు తీసుకోవాలి.

ఇది చివరికి భద్రతా చర్యలు,వాటాదారుల రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్,అలాగే ఉద్యోగులు,మహమ్మారి అనంతరం ప్రవర్తనలను సమర్థించే అధునాతన పద్ధతులను కలిగి ఉంటుంది. ఇది కిరీటంలో తురాయి లాంటిది కాగా, వండర్‌లా కొవ్ సేఫ్‌ సర్టిఫికేట్ పొందిందని వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్అరుణ్ కె చిట్టిలప్పిల్లి తెలిపారు. దేశంలో ఈ తరహా సర్టిఫికెట్ అందుకున్న మొదటి కంపెనీగా నిలవడం ద్వారా మరింత సురక్షితను నిర్ధారించేందుకు,మహమ్మారి విస్తరించకుండా జాగ్రత్తలు,మార్గదర్శకాలను అనుసరించేందుకు అర్హమైనదిగా నిలిచింది.మహమ్మారి అనంతరంఅమ్యూజ్‌మెంట్ పార్కులు మళ్ళీ నార్మల్ పరిస్థితులకు అనుగుణంగా తిరిగి డిమాండ్‌ను పుంజుకుంటాయని వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్అరుణ్ కె చిట్టిలప్పిల్లి అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమ్యూజ్‌మెంట్‌ పార్కులు వ్యూహాత్మకంగా మార్పులు చేయాలి
అమ్యూజ్‌మెంట్‌ పార్కులు వ్యూహాత్మకంగా మార్పులు చేయాలి
అమ్యూజ్‌మెంట్‌ పార్కులు వ్యూహాత్మకంగా మార్పులు చేయాలి

ట్రెండింగ్‌

Advertisement