e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News ప్ర‌భాస్ బ్యూటీపై అమితాబ్ బచ్చ‌న్ కామెంట్..!

ప్ర‌భాస్ బ్యూటీపై అమితాబ్ బచ్చ‌న్ కామెంట్..!

ప్ర‌భాస్ బ్యూటీపై అమితాబ్ బచ్చ‌న్ కామెంట్..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్‌. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న సీత‌గా కృతిస‌న‌న్ న‌టించ‌నుంది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ద‌మైంది కృతి. గ‌తంలో మ‌హేష్ స‌ర‌స‌న వ‌న్ నేనొక్క‌డినే, నాగ చైత‌న్య స‌ర‌స‌న దోచేయ్ వంటి చిత్రాల‌లో న‌టించింది. తెలుగులో పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌క‌పోయే స‌రికి బాలీవుడ్ చెక్కేసింది. దిల్‌వాలే, రాబ్తా, బరేలీ కీ బర్ఫీ వంటి సినిమాల‌తో హిందీలో టాప్ హీరోయిన్‌గా మారిన కృతి ప్ర‌స్తుతం బచ్చన్‌ పాండే, మిమి, గణపత్‌ వంటి సినిమాలు చేస్తుంది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కృతిస‌న‌న్ అప్పుడప్పుడు హాట్ హాట్‌గా ఫొటో షూట్ చేస్తూ ఆ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. తాజాగా పింక్‌, బ్లూ, గ్రీన్‌, బ్లాక్‌ రంగులతో నిండిన మాక్సీ డ్రెస్ ధరించి కొంటె చూపులు చూస్తున్న పిక్ షేర్ చేసింది. ఈ ఫొటోల‌కు నెటిజ‌న్సే కాక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ సైతం ఫిదా అయ్యారు. వావ్‌ అంటూ ఎరుపు రంగు హార్ట్‌ సింబల్‌ను జతచేశాడు. ప్ర‌స్తుతం కృతిస‌న్‌కు 38 మిలియన్‌ మంది ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్ర‌భాస్ బ్యూటీపై అమితాబ్ బచ్చ‌న్ కామెంట్..!

ట్రెండింగ్‌

Advertisement