RRR Event | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అత్యంత గ్రాండ్‌గా మార్చి 25న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. రాజమౌళి సినిమాలే కాదు ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో జరుగుతాయి. ప్రమోషన్స్ ఎక్కడ జరిగినా ఆయా ఇండస్ట్రీలో పేరున్న నటులను గెస్ట్లుగా పిలిచి సినిమా క్రేజ్‌ను మరింత వచ్చేలా చూస్తాడు. ఇటీవలే శనివారం ఈ చిత్రం బెంగళూర్‌లో ప్రెస్‌మీట్‌ను జరుపుకుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ ప్రెస్‌మీట్‌కు ముఖ్య అథితిగా వచ్చాడు. లేటెస్ట్గా ఢిల్లీలో జరుగనున్న ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ముఖ్య అథితిగా రాబోతున్నాడు. ఈ వేడుక ఇంపిరియల్ లాన్ హోటల్లో జరుగునుంది.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఆలీయా భట్, ఒలీవియా మొర్రీస్‌లు హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ అజయ్‌దేవగణ్ కీలకపాత్రలో నటించాడు. డివివి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని 550కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాడు.
ఇవి కూడా చదవండి: