e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News మారుతున్న జీవనశైలిసవాళ్ల పై అల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా వర్ట్యువల్‌ డిస్కషన్

మారుతున్న జీవనశైలిసవాళ్ల పై అల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా వర్ట్యువల్‌ డిస్కషన్

హైదరాబాద్‌, జూలై:అల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా ‘మహమ్మారి అనంతర ప్రపంచంలో వేగంగా మారుతున్నజీవనశైలితో కుటుంబ ఆరోగ్యం పొందడంలో ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై వర్ట్యువల్‌ ప్యానెల్‌ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆహార,జీవనశైలి పరంగా తప్పనిసరిగా చేసుకోవాల్సిన మార్పులను గురించి చర్చించిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌, మ్యాక్స్‌హెల్త్‌కేర్‌-ఢిల్లీ, రీజనల్‌ డైటెటిక్స్‌ హెడ్‌ రితికా సమద్ధార్‌, న్యూట్రిషియనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌, షీలా కృష్ణస్వామి,అల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా గ్లోబల్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఎమిలీ ఫ్లీష్మాన్‌ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఆర్‌జె షెజ్జీ మోడరేటర్‌గా వ్యవహరించారు. భారతదేశంతో పాటుగా అమెరికాకు చెందిన నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన చుట్టూ ఉన్న ప్రపంచం అత్యంత వేగంగా మారుతుండటమే కాదు, అంతే వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లపై అనిశ్చితి కూడా కొనసాగుతుంది. సరైన కుటుంబ ఆరోగ్యం నిర్వహించడం అనేది ఎన్నో భారతీయ కుటుంబాలు తాము దృష్టి కేంద్రీకరించిన అత్యంత కీలకాంశాలలో ఒకటిగా నిలిచింది. ఎందుకంటే, ప్రతివ్యక్తి నియంత్రణలోనే ఇది ఉంటుంది.

- Advertisement -

పౌష్టికాహార, సమతుల్యమైన ఆహారం మాత్రమే చక్కటి ఆరోగ్యంకు తోడ్పాటునందిస్తుందన్నది భావన మాత్రమే కాదు ఎన్నో సంవత్సరాలుగా చర్చ జరుగుతున్న అంశం కూడా! ఏది తినాలి, ఏది తినకూడదు అనే అంశాలు తరచుగా ప్రధాన వార్తా శీర్షికలలో కనిపిస్తుంటాయి. సాధారణంగా వినియోగదారులు మరీ ముఖ్యంగా మాతృమూర్తులు శాస్త్రీయ సలహాలను, ధోరణులను తమ సొంత పాకశాస్త్ర నమ్మకాలు, ప్రాచుర్యం పొందిన సంప్రదాయాలు, వంటకాలు, స్థానికంగా లభించే ఆహారంతో మిళితంచేయడానికి ప్రయత్నిస్తుంటారు.

ఈ చర్చలో ప్యానలిస్ట్‌లు పలు ఉదాహరణలను వెల్లడించడంతో పాటుగా తమ వ్యక్తిగత జీవితాలలో ఎదురైన అనుభవాలను గురించి కూడా తెలుపుతుతూ భారతదేశ వ్యాప్తంగా కుటుంబాలు తమ ఆరోగ్యం, జీవనశైలి నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాల్సిన ఆవశ్యకతను తెలిపారు. ఈ చర్చలో బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ ‘‘ నేటి ప్రపంచంలో, మాతృమూర్తిగా బాధ్యతలను నిర్వర్తించడం అంత సులభమేమీ కాదు.

ఎన్నో అంశాలు మనకు బాధను, ఆందోళనను కలిగిస్తాయి. చాలాసార్లు మనం వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. నా వరకూ, ఓ మాతృమూర్తిగా, నా కుటుంబం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండటం తీవ్ర ఒత్తిడి కలిగిస్తుంది. కానీ గత సంవత్సరంన్నర కాలంగా నేను తెలుసుకున్న అంశమేమిటంటే, చాలా అంశాలు నా నియంత్రణలో ఉండవు,కానీ నా కుటుంబ ఆరోగ్యం మాత్రం నా నియంత్రణలోనే ఉంటుంది. నా కుటుంబ ఆరోగ్య ప్రణాళికలలో భాగంగా మేము ప్రతి రోజూ ఓ గుప్పెడు బాదములను తింటుంటాం. ఆరోగ్యవంతమైన, పోషకాలతో కూడిన స్నాక్‌గా బాదములు నిలుస్తాయి. వీటిని నేరుగా లేదా ఓట్స్‌, షేక్స్‌తో కలుపుకుని కూడా తినవచ్చని అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana