సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో వచ్చే కొన్ని పంచ్ డైలాగ్స్ ను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. క్యారెక్టరైజేషన్ లో భాగంగా హీరో చెప్పే కొన్ని కొత్త రకమైన పదాలను ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. తమ అభిమాన హీరో చెప్పిన పదాలను ఇమిటేట్ చేస్తూ వీడియోలు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ జనాల దృష్టి అంతా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప పైనే ఉంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ నోటి నుంచి ఓ ఊతపదం వస్తుందని జోరుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవలే చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగింపులో అల్లు అర్జున్ పుష్ప గురించి ఓ మాట చెప్పాలంటూ.. తగ్గేదే లే అంటూ చెప్పుకొచ్చాడు. ఇపుడీ పదం తెగ ట్రెండింగ్ అవుతుంది. పుష్పలో బన్నీ నోటి నుంచి వచ్చే ఊతపదం ఇదేనంటూ అంతా చర్చించుకుంటున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న పుష్ప చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రలో కనిపించిన బన్నీ..నా మొలతాడులో తాయెత్తు అంటూ చెప్పే ఊతపదం ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.