అల్లు రామలింగయ్యతో ఆయన కుటుంబ సభ్యులు అందరి కంటే దగ్గరగా ఉండే అవకాశం తనకు దక్కిందని అన్నారు స్టార్ హీరో చిరంజీవి. అల్లు రామలింగయ్య విశిష్ట నటుడని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. అల్లు అరవింద్, చిరంజీవి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ..‘అల్లు రామలింగయ్య గొప్ప నటుడే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కుటుంబ సభ్యుడిగా, ఎన్నో చిత్రాల్లో కలిసి నటించిన సహ నటుడిగా అల్లు రామలింగయ్య సాన్నిహిత్యం దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు. ఉన్నతమైన హాస్యాన్ని అందించిన దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య అని వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య అవార్డును దర్శకుడు త్రివిక్రమ్‌కు అందించారు.