బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 27న హైటెక్ సిటీలోని శిల్పాకళావేదికలో గ్రాండ్‌గా జరగబోతుంది. ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.
గత కొంతకాలం నుంచి మెగా ముద్ర… మెగా కాంపౌండ్ ఇమేజ్ నుంచి బయటపడాలని, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు రావాలని తహతహలాడుతున్నాడు అల్లు అర్జున్.. అందుకు తగ్గట్టే సొంత ఇమేజ్ను సంపాందించుకుంటున్నాడు.. అందుకే ఇప్పుడు తను మెగా కాంపౌండ్‌కు దూరంగా ఉన్నానని చెప్పడం గురించే బాలకృష్ణ అఖండ వేడుకకు అతిథిగా హాజరుకాబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అఖండ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అల్లు అర్జున్ ఈ వేడుకకు అతిథిగా వస్తున్నాడని బన్నీ సన్నిహితులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Allu Arjun: బాలీవుడ్ స్టార్‌తో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న బన్నీ
Rekha boj | సామీ సామీ సాంగ్ కోసం రెండు గాజులు అమ్ముకున్న నటి..
అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ గురించి ఈ విషయాలు తెలుసా..?
బాలయ్య, అల్లు అరవింద్ క్రేజీ కాంబినేషన్.. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి నటసింహం సినిమా..?
Unstoppable టాక్ షో కోసం బాలయ్యను అల్లు అరవింద్ అలా ఒప్పించాడా..?