e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News నాకు నిద్ర‌ప‌ట్ట‌డం లేదు.. అజా లౌడ్‌స్పీక‌ర్‌ను నిషేధించండి!

నాకు నిద్ర‌ప‌ట్ట‌డం లేదు.. అజా లౌడ్‌స్పీక‌ర్‌ను నిషేధించండి!

నాకు నిద్ర‌ప‌ట్ట‌డం లేదు.. అజా లౌడ్‌స్పీక‌ర్‌ను నిషేధించండి!

ప్ర‌యాగ్‌రాజ్: ఉద‌యాన్ని త‌న నిద్ర‌ను చెడ‌గొడుతున్న అజా లౌడ్‌స్పీక‌ర్ల‌ను నిషేధించాలంటూ జిల్లా మెజిస్ట్రేట్‌కు లేఖ రాశారు అల‌హాబాద్ యూనివ‌ర్సిటీ వైస్ చాన్స్‌ల‌ర్ సంగీతా శ్రీవాస్త‌వ‌. త‌న ఇంటి ద‌గ్గ‌రే ఉన్న మ‌సీదులో ఉద‌యాన్నే అజా కోసం లౌడ్‌స్పీక‌ర్లు వాడుతున్నార‌ని, దీని వ‌ల్ల నిద్రకు భంగం క‌లుగుతోంద‌ని డీఎం భానుచంద్ర గోస్వామికి రాసిన లేఖ‌లో ఆమె చెప్పారు. దీనిపై స్పందించిన డీఎం.. నిబంధ‌న‌ల ప్ర‌కారం తాను త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చెప్పారు. అజా పూర్తయిన త‌ర్వాత తాను మ‌ళ్లీ నిద్ర పోలేక‌పోతున్నాని, దీనివ‌ల్ల త‌న‌కు తల‌నొప్పి వ‌స్తోంద‌ని ఆమె ఆ లేఖ‌లో తెలిపారు. తాను ఏ మ‌తానికీ వ్య‌తిరేకం కాక‌పోయినా.. రంజాన్ నెల‌లో అయితే మ‌రీ ఉద‌యం 4 గంట‌ల‌కే లౌడ్‌స్పీక‌ర్లు వాడుతున్నార‌ని సంగీతా చెప్పారు. హ‌ద్దు మీరితే ఇత‌రుల స్వేచ్ఛ‌కు భంగం వాటిల్లుతుంద‌న్న కోర్టు తీర్పును కూడా ఆమె లేఖ‌లో ప్ర‌స్తావించారు. అయితే ఈ లేఖ‌ను కొంద‌రు స‌మ‌ర్థిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాకు నిద్ర‌ప‌ట్ట‌డం లేదు.. అజా లౌడ్‌స్పీక‌ర్‌ను నిషేధించండి!

ట్రెండింగ్‌

Advertisement