అల్ అమెరాత్: స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (46; 4/9).. మొదట బ్యాట్‌తో, ఆ తర్వాత బాల్‌తో విశ్వరూపం చూపడంతో టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ సూపర్-12కు దూసుకెళ్లింది. గ్రూప్-బిలో భాగంగా గురువారం జరిగిన పోరులో బంగ్లా 84 పరుగుల తేడాతో పపువా న్యూ గినియాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్ముదుల్లా (28 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. షకీబ్, లిటన్ దాస్ (29) రాణించారు. పపువా బౌలర్లలో మోరియా, డామియన్, అసద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో షకీబ్ ధాటికి పపువా న్యూ గినియా 19.3 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. కిప్లిన్ డోరిగా (46 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన వాళ్లంతా పెవిలియన్‌కు వరుస కట్టారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ నాలుగు, సైఫుద్దీన్, తస్కీన్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తానేసిన తొలి బంతికే చార్లెస్ అమినీ (1)ని ఔట్ చేసిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ షకీబ్.. రెండు బంతుల తర్వాత సిమాన్ అటాయి (0)ని కూడా బుట్టలో వేసుకున్నాడు. షకీబ్ అదే జోరులో వరుస ఓవర్లలో మరో రెండు వికెట్లు పడగొట్టడంతో పపువా 29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. ఆఖర్లో కిప్లిన్ కాస్త ధాటిగా ఆడి ఓటమి అంతరాన్ని తగ్గించాడు.
స్కాట్లాండ్ ముందంజ
బౌలర్ల సమిష్టి కృషికి బ్యాటర్ల బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తోడవడంతో స్కాట్లాండ్ సూపర్-12కు అర్హత సాధించింది. గ్రూప్-బిలో భాగంగా గురువారం జరిగిన పోరులో స్కాట్లాండ్ 8 వికెట్ల తేడాతో ఒమన్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. భారత సంతతి ఆటగాడు జతిందర్ సింగ్ (0) ఇన్నింగ్స్ రెండో బంతికే సమన్వయ లోపంతో రనౌట్ కాగా.. హైదరాబాద్‌కు చెందిన సందీప్ గౌడ్ (5) ప్రభావం చూపలేకపోయాడు. అనంతరం ఛేదనలో స్కాట్లాండ్ 17 ఓవర్లలో 2 వికెట్లకు 123 పరుగులు చేసింది. కెప్టెన్ కైల్ కోట్జర్ (41), బెర్రింగ్టన్ (31 నాటౌట్) రాణించారు. గ్రూప్-బిలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన స్కాట్లాండ్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. బంగ్లాదేశ్ 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సూపర్-12కు అర్హత సాధించాయి.
స్కోరు బోర్డు
బంగ్లాదేశ్: నయీమ్ (సి) సేసె బావు (బి) మోరియా 0, లిటన్ దాస్ (సి) సేసె బావు (బి) అసద్ 29, షకీబ్ (సి) అమిని (బి) అసద్ 46, ముష్ఫికర్ (సి) హిరి (బి) అటాయి 5, మహ్ముదుల్లా (సి) సోపర్ (బి) డామియన్ 50, అఫిఫ్ (సి) డామియన్ 21, నూరుల్ (సి) సేసె బావు (బి) డామియన్ 0, సైఫుద్దీన్ (నాటౌట్) 19, హెమెదీ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 181/7. వికెట్ల పతనం: 1-0, 2-50, 3-72, 4-101, 5-144, 6-153, 7-161, బౌలింగ్: మోరియా 4-0-26-2, డామియన్ 4-0-40-2, సోపర్ 4-0-53-0, సేసె బావు 2-0-20-0, అసద్ 3-0-26-2, చార్లెస్ 2-0-9-0, సిమన్ అటాయి 1-0-6-1.
పపువా న్యూ గినియా: లెగా సియాక (ఎల్బీ) సైఫుద్దీన్ 5, అసద్ (సి) నూరుల్ (బి) తస్కీన్ 6, చార్లెస్ (సి) నయీమ్ (బి) షకీబ్ 1, సేసె బావు (సి) నయీమ్ (బి) షకీబ్ 7, సిమన్ అటాయి (సి) మెహెదీ (బి) షకీబ్ 0, హిరి (సి) నూరుల్ (బి) షకీబ్ 8, నార్మన్ (సి) ముష్ఫికర్ (బి) మెహెదీ 0, కిప్లిన్ (నాటౌట్) 46, సోపర్ (బి) సైఫుద్దీన్ 11, మోరియా (రనౌట్) 3, డామియన్ (సి) నూరుల్ (బి) తస్కీన్ 5, ఎక్స్‌ట్రాలు: 5: మొత్తం: 19.3 ఓవర్లలో 97 ఆలౌట్. వికెట్ల పతనం: 1-11, 2-13, 3-13, 4-14, 5-24, 6-24, 7-29, 8-54, 9-80, 10-97, బౌలింగ్: సైఫుద్దీన్ 4-0-21-2, ముస్తఫిజుర్ 4-0-34-0, తస్కిన్ 3.3-1-12-2, షకీబ్ 4-0-9-4, మెహెదీ 4-0-20-1.