బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ..రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో కనిపించనుండగా, ఈ అమ్మడి ఫస్ట్ లుక్కు టైం ఫిక్స్ చేశారు మేకర్స్. మార్చి 15న అలియా భట్ బర్త్డే కావడంతో ఆ రోజు ఉదయం 11గం.లకు సీత పాత్ర పోషిస్తున్న అలియా ఫస్ట్ లుక్ విడుదల కానుందని పేర్కొన్నారు. అలియా సీత పాత్రలో ఎలా కనిపిస్తుందోనని మేకర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రం కాల్పనిక గాథ నేపథ్యంలో తెరకెక్కుతుండగా, ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్.. కొమురం భీం పాత్రలో కనిపించి సందడి చేయనుండగా, రామ్ చరణ్ .. అల్లూరి సీతారామరాజు పాత్రలో సందడి చేయనున్నారు. కాగా, అలియా భట్.. గంగూభాయ్ కంతియావాడి అనే చిత్రంలోను నటిస్తుండగా, ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.