e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News స్నేహితురాలి ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో డ్యాన్స్ చేసిన అలియా

స్నేహితురాలి ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో డ్యాన్స్ చేసిన అలియా

స్నేహితురాలి ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో డ్యాన్స్ చేసిన అలియా

ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత మ‌హేష్ భ‌ట్ గారాల ప‌ట్టి అలియా భ‌ట్ ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా మారిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు చిత్ర‌సీమ‌కు కూడా ప‌రిచ‌యం అవుతుంది. ఈ రోజు అలియా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి అలియా భ‌ట్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు మేక‌ర్స్.

ప్ర‌స్తుతం అలియా భ‌ట్ జైపూర్‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. త‌న క్లోజ్ ఫ్రెండ్ రియా ఖురానా ప్రీ వెడ్డింగ్ వేడుక‌కు హాజ‌రైన అలియా భ‌ట్ ఆ వేడుక‌లో త‌న  స్నేహితురాలితో క‌లిసి ప‌లు బాలీవుడ్ హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేసింది. పింక్ క‌ల‌ర్ శారీలో అదిరిపోయే లుక్‌లో క‌నిపించిన అలియా స్టెప్పుల‌తోను మంత్ర‌ముగ్ధ‌లుని చేసింది. ప్ర‌స్తుతం అలియా భ‌ట్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్నేహితురాలి ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో డ్యాన్స్ చేసిన అలియా

ట్రెండింగ్‌

Advertisement