బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు అలీ రెజా. పలు సీరియల్స్‌లో నటించిన అలీ ఆ క్రేజ్‌తో బిగ్ బాస్ షోకి వెళ్లారు. అక్కడ కంటెస్టెంట్స్‌కి మంచి పోటీ ఇచ్చారు. మధ్యలో ఎలిమినేట్ అయిన కూడా మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్‌లోకి ప్రవేశించారు. బిగ్ బాస్ తర్వాత అలీ రాజా క్రేజ్ మరింత పెరిగింది. పలు సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఆ మధ్య నాగార్జునతో కలిసి వైల్డ్ డాగ్ అనే సినిమా చేశాడు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అలీ రెజా ఇటీవల ఓ వీడియో షేర్ చేస్తూ తన శ్రీమతి మసుమ గర్భవతి అని తెలియజేశాడు.దీంతో నెటిజన్స్, పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా అలీ భార్య మసుమ సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హిమజ, శివజ్యోతి, లాస్య, శ్రీవాణి తదితరులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలీ భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.అలీ ‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’ అనే మరో సినిమా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం విదితమే!