పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్‌ల ముద్దుల తనయుడు అకీరా నందన్ రాబోవు రోజులలో వెండితెరపై సందడి చేయడం పక్కా అని మెగా ఫ్యాన్స్ గట్టగా నమ్ముతున్నారు. రేణూ దేశాయ్ మాత్రం దీనిని ఖండిస్తుంది. అకీరాకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అదే చేస్తాడు. తన తండ్రిలానే హీరో కావాలని అతనికి లేదని చెప్పుకొచ్చింది.
ఆ మధ్య పవన్- అకీరాకి సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. లాక్డౌన్ సమయంలో మ్యూజిక్ నేర్చుకుంటుండగా, ఆ మ్యూజిక్ టీచర్‌తో కలిసి తండ్రి కొడుకులు ఫొటో దిగారు. దానిని షేర్ చేసిన టీచర్ సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ తరచుగా తన పిల్లలకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా తన కుమారుడు కర్రసాముకి సంబంధించిన వీడియో షేర్ చేసింది. కరాటే, కుంగ్ ఫు వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది పూణేలో టాప్ గా పేరు తెచ్చుకున్నాడు పవన్. ఇప్పుడు తండ్రి బాటలోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అకిరా తాజాగా స్టన్నింగ్ వీడియోతో అందరిని ఆశ్చర్యపరిచాడు.కర్రని ఓ రేంజ్లో తప్పుతున్న అకీరా మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశాడు.