బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మరి కొద్ది రోజులలో ఐదో కార్యక్రమం జరుపుకోనుంది. అయితే సీజన్ 4 కంటెస్టెంట్స్ మిగతా సీజన్ కంటెస్టెంట్స్ కన్నా బాగా గుర్తింపు దక్కించుకున్నారనే విషయం మనందరికి తెలిసిందే. ఇక ప్రత్యేకంగా చెప్పాలి అంటే అఖిల్- మోనాల్ జంట గురించి. వారు హౌజ్‌లో ఉన్నప్పుడు నిత్యం హెడ్‌లైన్స్‌లో ఉండేవారు. బయటకు వచ్చాక కూడా అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు.
అఖిల్, మోనాల్ క్రేజ్ గమనించిన నిర్వాహకులు ఇద్దరితో ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేశారు. రానున్న రోజులలో సినిమా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే మోనాల్‌పై ఎప్పుడు తన ప్రేమను వ్యక్తపరిచే అఖిల్ ఈ సారి కవిత రూపంలో తెలియజేస్తూ.. మోనాల్‌తో వీడియో కాల్ మాట్లాడిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ప్రేమ క్యాన్సర్ వంటిది.. అది మరిచిపోయినట్టు చేస్తుంది.. చివరకు ప్రాణాలను తీసుకెళ్లిపోతోంది’ అంటూ లవ్ ఎమోజీని జత చేశాడు. ప్రస్తుతం అఖిల్ కామెంట్ చర్చనీయాంశంగా మారింది.