తమిళ స్టార్ హీరో అజిత్ సింప్లిసిటీకు కేరాఫ్ అడ్రెస్ అని చెప్పవచ్చు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. ఇండస్ట్రీకు రాకముందు హైదరాబాద్‌లో బైక్ మెకానిక్‌గా పని చేసిన అజిత్ ఎంతో స్వయం కృషితో ఈ స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన కూడా ఆయన సింపుల్‌గా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
తాజాగా అజిత్ ఆటోలో ప్రయాణిస్తుండగా , ఆయనను ఓ వ్యక్తి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. అజిత్ సింప్లిసిటీను చూసి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం వాలిమై అనే సినిమాతో బిజీగా ఉండగా, ఈ చిత్రాన్ని మే 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా స్పెయిన్‌లో తాజా షెడ్యూల్ జరుపుకోనుంది.