హిందీ నటుడు అజయ్‌దేవ్‌గణ్, కన్నడ హీరో సుదీప్ మధ్య నెలకొన్న హిందీ జాతీయ భాషా వివాదం దేశవ్యాప్తంగా దూమారాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అజయ్‌దేవ్‌గణ్ వ్యాఖ్యల్ని దక్షిణాది సినీ, రాజకీయ ప్రముఖులు తప్పుబడుతూ సుదీప్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
ఈ వివాదం ఇంకా నడుస్తుండగానే హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ హిందీ ఇండస్ట్రీలో ఇంగ్లీష్‌ను విరివిగా ఉపయోగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. హిందీ షూటింగ్స్ సందర్భంగా అత్యధికులు ఇంగ్లీష్‌లోనే సంభాషిస్తారని..ఈ ధోరణిలో మార్పు రావాలన్నారు. దక్షిణాది వారు తమ మాతృభాష విషయంలో ఎంతో ఇష్టాన్ని చూపిస్తారని నవాజుద్దీన్ చెప్పారు. ‘దక్షిణాది వారు సినిమా సెట్స్‌లో మాతృభాషలోనే మాట్లాడుకుంటారు. స్క్రిప్ట్‌లు కూడా వారి ప్రాంతీయ భాషలోనే ఉంటాయి. మాతృభాష వల్ల సెట్స్‌లో తెలియని ఆత్మీయత ఏర్పడుతుంది’ అని నవాజుద్దీన్ సిద్ధిఖీ వ్యాఖ్యానించారు..