e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, December 4, 2021
Home News మెరుగైన ఫలితాలే లక్ష్యంగా

మెరుగైన ఫలితాలే లక్ష్యంగా

  • ఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
  • ఇప్పటికే ప్రారంభమైన బోధన
  • నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ
  • మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌పై దృష్టి
  • డిసెంబర్‌ 15లోగా సిలబస్‌ పూర్తికి విద్యాశాఖ కసరత్తు
  • వచ్చే నెల 21 నుంచి 100 రోజుల కార్యాచరణ..

ఈ ఏడాది ‘పది’ పరీక్షల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ప్రతి పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఈ నెల మొదటివారం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో అదనంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రతిసారి మెజార్టీ విద్యార్థులు మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో ఫెయిలవుతున్నట్లు గుర్తించిన అధికారులు.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటివరకు 70 శాతం సిలబస్‌ పూర్తికాగా డిసెంబర్‌ 15లోగా వందశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే విద్యార్థులను పరీక్షలకు పూర్తిస్థాయిలో సంసిద్ధం చేసేందుకు డిసెంబర్‌ 21 నుంచి 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, నవంబర్‌ 25 : పదో తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ పక్కా ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా ఈ నెల మొదటి వారం నుంచి ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రతీసారి మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో చాలా మంది విద్యార్థులు ఫెయిలవుతుండటంతో విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి వరకు 70 శాతం సిలబస్‌ పూర్తి చేయగా.. డిసెంబర్‌ 15లోగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది. డిసెంబర్‌ 21 నుంచి 100 రోజుల కార్యాచరణ రూపొందించనున్నది. విద్యార్థుల మేధస్సును బట్టి మూడు గ్రూపులుగా విభజించింది. చదువులో ముందంజలో ఉన్న విద్యార్థులను ఒక గ్రూపు, సగటు విద్యార్థులను ఇంకో గ్రూపు, పూర్తిగా వెనుకబడిన విద్యార్థులను మరో గ్రూపుగా విభజించి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.

- Advertisement -

ఈ నెల మొదటి వారం నుంచి ప్రత్యేక తరగతులు

జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ నెల మొదటి వారం నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు., అర్బన్‌ ప్రాంతాల్లోని స్కూళ్లలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టుపై బోధన చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 270 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రతి ఏటా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత తగ్గడానికి మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టులే ప్రధాన కారణమని గుర్తించి ఈ విషయాలపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది పునరావృతం కాకుండా తగు చర్యలు చేపడుతున్నది. ఈ రెండు సబ్జెక్టుల్లో మెళకువలు నేర్పిస్తున్నారు. డిసెంబర్‌ 15లోగా సిలబస్‌ను పూర్తి చేసి డిసెంబర్‌ 21 నుంచి 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను చేపట్టేందుకు సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్దేశించిన సమయంలోగా సిలబస్‌ను పూర్తి చేయడంతోపాటు ప్రతి చాప్టర్‌కు సంబంధించిన విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ప్రశ్నలు రూపొందించడం, విద్యార్థులస్థాయిని నిర్ధారించి మూడు గ్రూపులుగా విభజించడం, మూల్యాంకన గుర్తుల ఆధారంగా సాధనలను రాసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

వంద రోజుల కార్యాచరణ

వంద రోజుల కార్యాచరణలో భాగంగా ప్రధానంగా గతంలోని ప్రశ్నాపత్రాలు, మాదిరి ప్రశ్నాపత్రాలపై విద్యార్థులతో కసరత్తు చేయిస్తారు. మ్యాథ్స్‌కు సంబంధించి పేపర్‌-1లో వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చర రాశుల్లో రేఖీయ సమీకరణాల సాధన, వర్గ సమీకరణాలు, శ్రేణులు, నిరూపక రేఖ గణితం చాప్టర్లపై, పేపర్‌-2లో సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శ రేఖలు, ఛేదన రేఖలు, క్షేత్ర గణితం, త్రికోణమితి, సంభావ్యత, సాంఖ్యా శాస్త్రం చాప్టర్లపై విద్యార్థులు పట్టు సాధించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఎప్పటికప్పుడు అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్లిప్‌ టెస్టులతోపాటు గ్రాండ్‌ టెస్టులు నిర్వహిస్తూ, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినుంది.

ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణత సాధించేలా చర్యలు : డీఈవో సుశీంద్రరావు పదోతరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాం. ఈ నెల మొదటి వారం నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. గణితం, భౌతికశాస్త్రంలో ఉత్తీర్ణులయ్యేలా మెళకువలను నేర్పిస్తున్నాం. డిసెంబర్‌ 14 నుంచి సమ్మేటివ్‌ పరీక్షలను నిర్వహించేందుకు నిర్ణయించారు. డిసెంబర్‌ 21 నుంచి వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ చేపడుతాం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణులయ్యేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందించాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement